New smartphone buying guide: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది. పాత ఫోన్ స్లో.. అయిపోయినా లేదా కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినా కొంతమంది వెంటనే షాపింగ్ చేసేస్తుంటారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ స్టోర్స్‌లో రక రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి.. టెంప్ట్ అయిపోయి నచ్చిన ఫోన్ ఆర్డర్ చేస్తే వారు లేకపోలేదు. కానీ.. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టి కొత్త మొబైల్ కొనే ముందు కొన్ని ముఖ్య మైన విషయాలను తెలుసుకోక పోతే..ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది.మీరు కూడా కొత్త ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే.. ఈ 4 విషయాలను కచ్చితంగా చెక్ చేయండి.
మనం ఫోన్ కొనేటప్పుడు.. కేవలం కెమెరా మెగాపిక్సెల్స్, రామ్ చూసి మోసపోతుంటాం. కానీ ఫోన్‌కి.. చాలా ముఖ్యమైనంది ప్రాసెసర్. మీరు గేమ్స్ ఆడినా..హెవీ యాప్స్ వాడినా ప్రాసెసరే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మార్కెట్లో రూ. 15,000 నుంచి రూ.30,000 బడ్జెట్‌లో మంచి స్నాప్ డ్రాగన్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు.. ఉన్న ఫోన్లను కొనడం బెస్ట్. సరైన ప్రాసెసర్ లేకపోతే.. ఫోన్ కొన్ని రోజుల్లోనే హ్యాంగ్ అవ్వడం మొదలవుతుంది.
కొన్ని కంపెనీలు తక్కువ ధరకే.. అట్రాక్టివ్ ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. కానీ.. ఆ తర్వాత వాటికి ఎలాంటి ఆండ్రాయిడ్ అప్‌డేట్లు.. లేదా సెక్యూరిటీ ప్యాచ్‌లు ఇవ్వవు. దీని వల్ల ఫోన్ తొందరగా కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు కొనబోయే.. ఫోన్‌కు కంపెనీ కనీసం 2 నుంచి 3 సంవత్సరాల మేజర్ అప్‌డేట్లు ఇస్తుందో లేదో ముందే చెక్ చేసుకోవాలి.
ప్రస్తుత బిజీ లైఫ్‌లో రోజంతా .. ఫోన్ పని చేయాలంటే.. మంచి బ్యాటరీ బ్యాకప్.. ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో లభించే ట్రెండీ స్మార్ట్ ఫోన్లలో కనీసం 5000 mAh బ్యాటరీ, కనీసం 33W నుంచి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. కొన్ని బ్రాండ్ల ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ తక్కువగా ఉండి.. ఛార్జింగ్ నిలవకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మనం కొన్న ఫోన్‌ను ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అప్ డేట్ చేసుకోవడానికి అమ్మాలనుకున్నప్పుడు.. మంచి బ్రాండ్ అయితేనే సరైన రీసేల్ వాల్యూ వస్తుంది.అలాగే.. మీ ప్రాంతంలో ఆ మొబైల్ కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్ దగ్గరలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఒక వేళ ఫోన్ రిపేర్ వస్తే.. సర్వీస్ సెంటర్లు దూరంగా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Also Read: వాట్సాప్‌లో తెలియని గ్రూప్‌లలో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!
మార్కెట్లో సాధారణ బడ్జెట్ ఫోన్ల ధరలు రూ.12,000 నుంచి ప్రారంభమై, ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రూ.70,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంటున్నాయి. ఏ రేంజ్‌లో ఫోన్ కొన్నప్పటికీ పైన చెప్పిన నాలుగు విషయాలను క్రాస్ చెక్ చేసుకోవడం మీ బాధ్యత. చిన్న అజాగ్రత్త కూడా మీ వేల రూపాయలను వృథా చేస్తుంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి,స్మార్ట్ షాపింగ్ చేయండి.