Jio Family Plan: రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్లతో వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే పోస్ట్‌పెయిడ్ విభాగంలో తక్కువ ధరలోనే కుటుంబం మొత్తానికి ఉపయోగపడే అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 449 ధరలో లభించే ఈ ప్లాన్ ద్వారా ఒకే బిల్లు కింద కుటుంబ సభ్యులను కూడా యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దేశంలోనే అత్యంత చౌకైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
జియో రూ. 449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ఈ ప్లాన్ ఎంచుకున్న ప్రైమరీ యూజర్ కు నెలకు 75 GB డేటా అందనుంది. ఈ పరిమితి పూర్తయిన తర్వాత ప్రతి గిగాబైట్ (GB) డేటాకు రూ. 10 చొప్పున ఛార్జ్ చేస్తారు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత SMSల ప్రయోజనం కూడా లభిస్తుంది.
ఈ ప్లాన్ లో కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునే వెసులుబాటును జియో కల్పిస్తోంది. ఒకే కనెక్షన్‌పై అదనంగా మరో మూడు సిమ్ (SIM) కార్డులను జతచేయవచ్చు. యాడ్-ఆన్‌గా జోడించే ప్రతి సిమ్ కార్డ్‌కి నెలకు ప్రత్యేకంగా 5 GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం ఉచితంగా లభించనుంది. అయితే ఈ యాడ్-ఆన్ ఫ్యామిలీ సిమ్‌ల కోసం ప్రతి సిమ్‌కు నెలకు రూ. 150 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ లో డేటా, కాల్స్ తో పాటు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. అలాగే జియో ఏఐ క్లౌడ్ (JioAICloud) సేవల్లో భాగంగా 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులోకి రానుంది. దాంతో పాటు దాదాపు రూ. 35,100 విలువైన ‘గూగుల్ ఏఐ ప్రో’ సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలల పాటు ఉచితంగా పొందే అవకాశాన్ని జియో కల్పిస్తోంది.
Also Read: సముద్రంలోకి 16 వేల గ్యాలన్ల పింక్ ద్రవం.. తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా సొంతంగా ‘5G స్టాండ్‌అలోన్’ (SA) నెట్‌వర్క్‌ను ప్రారంభించిన ఏకైక సంస్థ రిలయన్స్ జియో. ఈ నేపథ్యంలో రూ. 499 ప్లాన్ పరిధిలోకి వచ్చే ప్రైమరీ సభ్యునితో పాటు యాడ్-ఆన్ ఫ్యామిలీ సిమ్ వినియోగదారులందరూ జియో అపరిమిత 5G (Unlimited 5G) డేటాను పొందేందుకు వీలు కల్పిస్తోంది. అయితే జియో 5G మెుబైల్ తో పాటు జియో 5G నెట్ వర్క్ పరిధిలో ఉన్న వినియోగదారులకు మాత్రమే ఈ వెసులుబాటు కలుగనుంది.
Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. పిల్లలు, వృద్ధులు, యువత కోసం.. అధిక వడ్డీతో 3 సూపర్ స్కీమ్స్!