Top Gen Z Gadgets:శ్వాస తీసుకోకపోయినా బతుకుతామేమో కానీ ఫోన్ లేకపోతే మాత్రం అస్సలు బ్రతకలేం అంటుంది ఇప్పటి జెన్ జీ బ్యాచ్.అది కనుక కాసేపు కనబడకపోతే అతలాకుతలం అయిపోతారు.ఎందుకంటే ఈ గాడ్జెట్ తోనే అంతగా కనెక్ట్ అయిపోయింది ఇప్పటి యూత్.
ఇక ఇదొక్కటే కాదండోయ్ ఇదే ఫోన్ తో పాటు మరికొన్ని గాడ్జెట్స్ ని కూడా అస్సలు వదలట్లేదు ఈ జెన్ జీ యూత్. మరి ఇంతకీ జెన్ జీ అంతలా అట్రాక్ట్ చేసిన ఆ గ్యాడ్జెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొదటగా జంజీ అని ఎవరిని అంటారు చూద్దాం.1997 నుంచి మధ్య 2012 మధ్య పుట్టిన వారిని జెన్ జీలుగా పిలుస్తారు.వీళ్ళు టెక్నాలజీని తర్వాత నేర్చుకున్న వాళ్ళు కాదు టెక్నాలజీ తో పాటుగా పెరిగినవాళ్లు.అందుకే ఈ గ్యాడ్జెట్స్ వీరికి లగ్జరీలా కాకుండా రోజువారి అవసరాలుగా కనిపిస్తాయి.
ఇక వీరు అత్యధికంగా వాడే గాడ్జెట్స్ స్మార్ట్ ఫోన్.ఇది లేకపోతే వీళ్ళ డైలీ లైఫ్ మొదలవదేనే చెప్పాలి.ఉదయం వచ్చినప్పటి నుంచి రాత్రి చంద్రుడు పోయేంతవరకు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అంతా ఈ స్మార్ట్ ఫోన్ లోనే ఉంది మరి.
అది కాలేజీలో నోట్స్ అయినా, ఫుడ్ ఆర్డర్ పెట్టడమైన, బ్యాంకు పని అయిన. టికెట్ బుక్ చేయాలనా, ఫోటోలు తీయాలన్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా అన్ని ఈ స్మార్ట్ ఫోన్ లోనే జరిగిపోతున్నాయి.అందుకే ఈ ఫోన్ ని ఇప్పుడు అస్సలు వదిలిపెట్టరు. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ అనేది వీళ్ళకి మాట్లాడే వస్తువు కాదు లైఫ్ లో ఒక ముఖ్యమైన భాగం.
ఇయర్ బర్డ్స్.. బస్సుల్లో మెట్రోలో, జిమ్ లో, కాలేజీలో ఇలా ఎక్కడ చూసినా యూత్ చెవిలో ఇయర్ బర్డ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వీటితో చాలామంది పాటలు వినడం వీడియో కాల్స్ చూడడం ఆన్లైన్ క్లాస్ లో అటెండ్ అవ్వడం, గేమ్స్ ఆడటం ఇలా ఎన్నో పనులకి ఈ ఇయర్ బర్డ్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. ఇవి వైర్లెస్ కావటం వల్ల యూత్ వీటిని చాలా కంఫర్టబుల్గా వాడేస్తుంది.
ఇక స్మార్ట్ వాచ్..ఒకప్పుడు మనం చేతికి వాచి పెట్టుకుంటే అది కేవలం సమయం చూడడానికి మాత్రమే పనికి వచ్చేది కానీ ఇప్పుడు రోజుకు ఎన్ని అడుగులు వేశారు, గుండె బీట్ ఎలా ఉంది ఎంత సేపు పడుకున్నారు, రోజుకు ఎంత క్యాలరీలు ఖర్చు పెట్టారు అనేటివన్నీ ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈజీగా తెలిసిపోతుంది.
అందుకే ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన ఇప్పటి యూత్ దీన్ని కంపల్సరిగా చేతికి చుట్టేస్తున్నారు.
ఇక మనం లాప్ టాప్ ని సినిమాల కోసమో లేకుంటే చిన్న చిన్న పనుల కోసమో వాడే వాళ్ళం. కానీ ఇప్పటి యూత్ కి లాప్ టాప్ అంటే స్టడీ మాత్రమే కాదు, ఆన్లైన్ క్లాసులు గ్రాఫిక్ డిజైనింగ్, కోడింగ్, వీడియో ఎడిటింగ్, యూట్యూబ్ ఇలా ఎన్నో పనుల్ని ఒక లాప్ టాప్ తోనే కానిచ్చేస్తున్నారు. ఇక చాలామంది ఇదే లాప్ టాప్ సహాయంతో డబ్బు కూడా సంపాదిస్తుండడం విశేషం.
ఇక చాలామంది పుస్తకాల కన్నా టాబ్లెట్ లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పిడిఎఫ్ చదవాలన్నా, నోట్స్ రాయాలన్నా, డ్రాయింగ్ చేయాలనా, ఆన్లైన్ లో క్లాసులు వినాలన్నా ఈ టాబ్లెట్లు చాలా ఫ్లెక్సిబుల్ గా కంఫర్టబుల్ గా ఉండి యూత్ కి బాగా దగ్గరయిపోయాయి.
ఇక గేమింగ్ డివైజెస్. ఇవి కేవలం ఆడటానికే కాదు ఆదాయానికీ అంటుంది ఇప్పటి జెన్ జీ బ్యాచ్. అవును ప్లీPlayStation, Xbox లాంటి గేమింగ్ డివైజెస్ ఆడుతూ వాటిని లైవ్ స్ట్రీమింగ్ చేసి, యూట్యూబ్ మరియు ఇతర మార్గాల ద్వారా బోలెడంత డబ్బు సంపాదిస్తుంది ఈ జెన్ జీ యూత్.
రోజంతా ఫోన్, ఇయర్‌బడ్స్, వాచ్ వాడటం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది.అందుకే ఇప్పుడు వీటన్నింటిని చార్జ్ చేసే పవర్ బ్యాంకు ని తమ బ్యాగులో కంపల్సరిగా ఉండాలనికోరుకుంటుంది జెన్ జీ బ్యాచ్.ముఖ్యంగా ఎటైనా దూరంగా ట్రావెల్ చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది కూడా.
ఇక ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత కొత్త కొత్త గాడ్జెట్స్ మరెన్నో మార్కెట్లోకి దిగిపోAI అసిస్టెంట్లు, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ గ్లాసెస్, AI నోట్ టేకర్లు ఇలా కొత్త కొత్త గాడ్జెట్స్ ని తమ సొంతం చేసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోయింది.
చదువు, ఉద్యోగం, కంటెంట్ క్రియేషన్… ఇలా చాలా పనుల్లో విచ్చలవిడిగా వాడేస్తుంది జెన్ జీ బ్యాచ్. అందుకే రింగ్ లైట్, ట్రైపాడ్, పోర్టబుల్ మైక్, మంచి కెమెరా ఉన్న ఫోన్ లాంటి గ్యాడ్జెట్స్ కూడా వారి లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయాయి.
అయితే ఈ గ్యాడ్జెట్స్ పెరగటం వల్ల మంచి తో పాటు చెడు కూడా ఉందండోయ్..అవును గ్యాడ్జెట్స్ వల్ల చాలా పనులు ఈజీగా అయిపోతాయి కానీ అవే గాడ్జెట్స్ ని రోజంతా వాడటం వల్ల కంటి సమస్యలు, మెడ వద్ద నొప్పి, నిద్ర లేకపోవడం, సోషల్ మీడియాకి బానిస కావడం వంటివి ఇబ్బందులు ఎన్నింటినో ఫేస్ చేస్తుంది ఇప్పటి యూత్.
ALSO READ:వర్షాల్లో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా?.. ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోవద్దు!
సో అవసరానికి మించిన వాడకం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చివరగా గ్యాడ్జెస్ట్ లని వాడాలి కానీ వాటికి బానిస కాకూడదు ఈ విషయాన్ని ఇప్పటి తరం తెలుసుకుంటే చాలా మంచిది!