ACB Trap: స్వేచ్ఛ బ్యూరో: అధికారికంగా సహాయ పడేందుకు లంచం తీసుకున్న రెవిన్యూ ఇన్స్ పెక్టర్ అతనికి సహకరించిన ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక వివరాలెకి వెలితే ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తహసీల్దార్ ఆఫీస్‌లో రాళ్లబండి గోపరాజు రెవిన్యూ ఇన్స్ పెక్టర్‌గా పని చేస్తున్నాడు. కాగా, కొన్నిరోజుల క్రితం ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమికి చెందిన పంచనామా నివేదికను తహసీల్దార్‌కు ఇవ్వాలని గోపరాజును కోరాడు. ఈ పని చేసి పెట్టటానికి గోపరాజు 15వేల రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని తనకు పరిచయం ఉన్న యాదగిరి అనే వ్యక్తికి ఇవ్వాలని అధికారి సూచించాడు.
Also Read: చంద్రబాబు విదేశీ పర్యటనలపై.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!
ఈ మేరకు పక్కా సమాచారం అందగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో సోమవారం యాదగిరి లంచం డబ్బు తీసుకోగానే ఏసీపీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో గోపరాజు చెప్పిన మేరకే ఆ డబ్బు తీసుకున్నట్టు యాదగిరి వెల్లడించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Also read: అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం!