Vivo Y50m Launch| వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ తన Y-సిరీస్‌లో భాగంగా చైనాలో Y50m 5G, Y50 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ బడ్జెట్ 5G ఫోన్‌లు దాదాపు ఒకేలా ఉండే హార్డ్‌వేర్, డిజైన్‌ను కలిగి ఉన్నాయి, కానీ బేస్ మెమరీ స్పెసిఫికేషన్‌లలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. తక్కువ ధరలో మంచి పనితీరు, దీర్ఘకాల బ్యాటరీ జీవితాన్ని అందించడమే ఈ ఫోన్‌ల లక్ష్యం.
డిజైన్, డిస్‌ప్లే & ఆపరేటింగ్ సిస్టమ్
వివో Y50m 5G మరియు Y50 5G రెండూ 6.74-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తాయి, ఇది 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో, ఈ డిస్‌ప్లే సాఫీగా, క్లియర్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 90.4% స్క్రీన్-టు-బాడీ రేషియో సన్నని బెజెల్స్ ఈ ఫోన్ డిస్‌ప్లేలో ప్రత్యేక ఆకర్షణ. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఆధారిత OriginOS 5ని ఉపయోగిస్తాయి.
పర్‌ఫామెన్స్, హార్డ్‌వేర్
ఈ ఫోన్‌లలో MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంది, ఇది 6nm టెక్నాలజీతో రూపొందించబడింది. ఈ చిప్ సెట్ సామర్థ్యం వల్ల మంచి 5G ఈ ఫోన్ పనితీరును అందిస్తుంది. రెండు మోడల్స్ 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తాయి. Y50 5G బేస్ మోడల్ 4GB RAMతో ఎంట్రీ-లెవల్ ఫోన్‌గా ఉండగా, Y50m 5G బేస్ మోడల్ 6GB RAMతో కొంచెం ఎక్కువ పనితీరును అందిస్తుంది.
కెమెరా సెటప్
ఈ ఫోన్‌లలో 13MP ప్రధాన కెమెరా (f/2.2 అపెర్చర్) ఉంది, ఇది సాధారణ ఫోటోలకు అనువైనది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఉపయోగపడుతుంది. ఈ కెమెరాలు బడ్జెట్ ధరకు తగినట్లు సాధారణ నాణ్యతను అందిస్తాయి.
బ్యాటరీ, ఛార్జింగ్
ఈ ఫోన్‌ల హైలైట్ 6,000mAh భారీ బ్యాటరీ. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, ఈ ఫోన్‌లు ఒక్కసారి ఛార్ చేస్తే.. 52 గంటల టాక్ టైమ్‌ను అందిస్తాయని వివో పేర్కొంది. దీర్ఘకాల బ్యాటరీ జీవితం కావాలనుకునే వారికి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ ఫోన్‌లు బ్లూటూత్ 5.4, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, GPS, GLONASS, Beidou, Galileo, QZSS వంటి గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్‌లను సపోర్ట్ చేస్తాయి. అలాగే, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, IR రిమోట్ కంట్రోల్ వంటి సెన్సార్లు ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు భద్రతను అందిస్తాయి. IP64 రేటింగ్‌తో, ఈ ఫోన్‌లు ధూళి, తేలికపాటి వాటర్ ప్రూఫ్ ఫీచరర్స్ ఉన్నాయి. అలాగే, SGS సర్టిఫైడ్ డ్రాప్ ఫాల్ టెస్ట్‌లలో ఐదు స్టార్లను సాధించాయి.
Also Read: 2025లో భారీ బ్యాటరీ లైఫ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు
ధర, లభ్యత
వివో Y50m 5G ధర 128GB + 6GB RAM కోసం CNY 1,499 (₹18,000), 8GB RAM కోసం CNY 1,999 (₹23,000), 12GB RAM కోసం CNY 2,299 (₹26,000). Y50 5G బేస్ మోడల్ 128GB + 4GB RAM కోసం CNY 1,199 (₹13,000) నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లు చైనాలో అజూర్, డైమండ్ బ్లాక్, ప్లాటినం రంగుల్లో వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా లభిస్తాయి.