E-Paper
Advertisement

హైదరాబాద్‌ ప్రజలకు ‘హైడ్రా’ అవసరం.. ఎంపీ చామల!

హైదరాబాద్‌ ప్రజలకు ‘హైడ్రా’ అవసరం.. ఎంపీ చామల!
Advertisement

MP Chamala: స్వేచ్ఛ బ్యూరో:హైదరాబాద్ మహానగర భవిష్యత్తుకు, ఇక్కడి ప్రజల రక్షణకు ‘హైడ్రా’ సంస్థ అత్యంత అవసరమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆక్రమణలకు గురైన అనేక చెరువులు, కుంటలు, నాళాలు, పార్కులు, లేఅవుట్లతో పాటు రోడ్లను సైతం హైడ్రా సమర్థవంతంగా కాపాడుతోందని కొనియాడారు. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే నగరంలో దాదాపు రూ. లక్షన్నర కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా రక్షణ పొందాయని తెలిపారు.

శాఖల సమన్వయం – కబ్జాలకు అడ్డుకట్ట

Advertisement

హైడ్రా ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరంలో సరికొత్త పాలనా మార్పు వచ్చిందని ఎంపీ పేర్కొన్నారు. మున్సిపల్, పోలీస్, రెవిన్యూ శాఖల మధ్య మెరుగైన సమన్వయాన్ని తీసుకొచ్చి, ఆస్తుల పరిరక్షణలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా చెరువులు, నాళాలు కబ్జా చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లు అమ్మేవారని, హైడ్రా వచ్చిన తర్వాతే ఆ అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట పడిందని వివరించారు.

98 శాతం ప్రజల ప్రయోజనాలే ముఖ్యం

Advertisement

గతంలో తెలియక మోసపోయి ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు కొనుగోలు చేసినవారు 1 నుంచి 2 శాతం మంది మాత్రమే ఉంటారని, అయితే ప్రభుత్వం మిగిలిన 98 శాతం ప్రజల ప్రయోజనాలు, నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించాల్సి ఉంటుందని ఎంపీ గుర్తుచేశారు. ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ధైర్యంగా, నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అభినందించారు.

Also Read: ల్యాగ్ లేదు.. డ్రామా లేదు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి 50 స్పీడ్ న్యూస్ అప్‌డేట్స్ ఇవే!

హైడ్రా మేలును ప్రజలు గుర్తించాలి

కమిషనర్ రంగనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తోందని, దీనిని జీర్ణించుకోలేక కొందరు మాఫియా వ్యక్తులు కుట్రపూరితంగా హైకోర్టులో పిటిషన్లు వేశారని ఎంపీ ఆరోపించారు. వరదల భయం లేని సురక్షిత నగర నిర్మాణం కోసం హైడ్రా చేస్తున్న కృషిని, దానివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సరైన కోణంలో అర్థం చేసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Related News

రంగనాథ్ మంచి, చెడు రెండూ చేశారు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు!

అర్థరాత్రి మట్టి మాఫియాకు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!

ఇకనుంచి ఒకే ఒక్క కార్డు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ!

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్!

సింగరేణిని నాశనం చేశారు.. KCR, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి!

మైనార్టీల ఉన్నత విద్య కోసం.. తెలంగాణ సర్కార్ భారీ స్కెచ్!

Big Stories

Advertisement
×