మహా కుంభమేళా నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. ఈ వేడుక కోసం మొత్తంగా 13 వేల రైళ్లను షెడ్యూల్ చేసింది. వీటిలో 10 వేల సాధారణ రైళ్లు ఉండగా, మిగతావి ప్రత్యేక రైళ్లు. అవసరం ఉన్న చోట్ల మరిన్ని అదనపు రైళ్లను నడుపుతున్నారు. అయితే, కుంభమేళా కారణంగా చాలా మంది లోకో పైలెట్లకు సరైన రెస్ట్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తాము రైళ్లు నడపలేమంటూ తేల్చి చెప్తున్నారు. తాజాగా ఓ లోకో పైలెట్ మార్గం మధ్యలోనే రైలును నిలిపివేసి దిగి వెళ్లిపోవడం సంచలనం కలిగించింది. చివరకు మరో పైలెట్ ను పిలిచి రైలును అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటన నేపథ్యంలో సుమారు నాలుగు గంటల పాటు రైలు నిలిచిపోయింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్-వారణాసి మధ్యలో పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది రైల్వేశాఖ. తాజాగా మీర్జాపూర్ లోని నిగత్ పూర్ రైల్వే స్టేషన్ లో ఓ లోకో పైలట్ కుంభమేళా ప్రత్యేక రైలును ఆపి, దిగి వెళ్లాపోయాడు. తాను ఏమాత్రం రెస్ట్ లేకుండా సుమారు 16 గంటల పాటు రైలును నడిపానని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఏక బిగిన 16 గంటల పాటు రైలును నడిపానని.. ఇక తనకు ఓపిక లేదని తేల్చి చెప్పాడు. అలసట కారణంగా రైలును నడపలేనని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈమేరకు సదరు లోకో పైలట్ రైలును ఆపి స్టేషన్ మాస్టర్ కు మెమో ఇచ్చాడు.
4 గంటలకు పైగా నిలిచిపోయిన రైలు
రైలును సడెన్ ఆగిపోవడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. వెంటనే ఈ విషయాన్ని స్టేషన్ మాస్టర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. అటు ప్రయాణీకుల ఆందోళన నేపథ్యంలో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రయాణీకులను శాంతింపజేశారు. రైల్వే ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియడంతో వెంటనే వారణాసి నుంచి మరో లోకో పైలెట్ ను పిలిచారు. ఆ తర్వాత రైలు ముందకు వెళ్లింది. సుమారు 4 గంటల పాటు నిగత్ పూర్ రైల్వే స్టేషన్ రైలు ఆగిపోయింది.
सरकार कहती है कि नौकरियां बढ़ रही हैं, लेकिन हकीकत यह है कि कर्मचारियों से हद से ज्यादा काम लिया जा रहा है। 16 घंटे की लगातार ड्यूटी के बाद लोको पायलट नथू लाल ने मिर्ज़ापुर (यूपी) के निगतपुर स्टेशन पर ट्रेन रोक दी और कहा अब नहीं चला पाऊंगा, माफ करें। pic.twitter.com/rIWB57GsgG
— Ranvijay (@Ranvijay444) January 31, 2025
Read Also: లోకో పైలెట్ నుంచి టీటీఈ వరకు.. పూర్తి మహిళా సిబ్బందితో పరుగులు తీసిన ఎక్స్ ప్రెస్ రైలు!
ప్రయాగరాజ్- వారణాసి మధ్యలో ప్రత్యేక రైలు
మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగరాజ్- వారణాసి నడుమ 00537 నెంబర్ గల ప్రత్యేక రైలును నడిపిస్తున్నారు. అయితే, ఈ రూట్ లో విపరీతమైన రద్దీ నెలకొన్నది. లోకో పైలెట్లకు డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. ఒక్కో వ్యక్తి సాధారణంగా చేసే డ్యూటీతో పోల్చితే రెట్టింపు డ్యూటీ చేస్తున్నారు. ఫలితంగా లోకో పైలెట్లు బాగా అలసిపోతున్నారు. అయినప్పటికీ కొంత మంది తప్పక డ్యూటీ చేస్తున్నారు. మరికొంత మంది ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లోకో పైలెట్లకు రెస్ట్ లేకపోతే ప్రయాణీకుల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. ఇప్పటికైనా తగిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు.
Read Also: మహిళ రైల్వే ట్రాక్ దాటుతుంటగా దూసుకొచ్చిన రైలు.. ఒక్కసారిగా షాక్..