E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజం పెద్ద మోస‌గాడు…PCBని మోసం చేసి, ఇంగ్లాండ్ కు వెళ్లాడు

బాబ‌ర్ ఆజం పెద్ద మోస‌గాడు…PCBని మోసం చేసి, ఇంగ్లాండ్ కు వెళ్లాడు
Advertisement

Ahmed Shahzad On Babar Injury: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న ఇంగ్లాండ్… తొలి టెస్ట్ లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభమైన రోజు ఈ విష‌యం బ‌య‌ట ప‌డింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్ 171 పరుగులు చేసి కుప్పకూలింది. అటు బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండు 112 పరుగులు చేసి కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ ఊపు చూస్తుంటే పాకిస్తాన్ కచ్చితంగా ఓడిపోయేలా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో బాబర్ ఆజంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడు తుది జట్టు నుంచి తప్పుకోవడంతోనే పాకిస్తాన్, ఈ స్థితికి వచ్చిందని మాజీలు విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్ కంటే ముందే బాబర్ ఆజంకు గాయమైందని చెబుతున్నారు.

బాబ‌ర్ ఆజంకు గాయం…రంగంలోకి కొత్త కెప్టెన్‌

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభమైన క్రమంలో బాబర్ ఆజం గాయం బారిన పడ్డాడు. దీంతో తుది జట్టు నుంచి అతనిని తప్పించారు. అతని స్థానంలో సల్మాన్ అలీ కెప్టెన్ గా బరిలోకి దిగారు. బాబర్ ఆజం కెప్టెన్ గా లేకపోవడంతో పాకిస్తాన్, తొలి ఇన్నింగ్స్ లో చెత్త ప్రదర్శన కన బరిచిందని అంటున్నారు. బాబర్ ఆజం గాయం ఇప్పుడు పాకిస్తాన్ కొంప ముంచింద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

4 నెల‌ల కిందే గాయ‌మైంది..ఇంగ్లాండ్ కు భ‌య‌ప‌డి, డ్రామాలు మొద‌లెట్టాడు

తొలి టెస్ట్ నేపథ్యంలో బాబర్ గాయం కారణంగా దూరం కావడంపై మాజీ క్రికెటర్ అహ్మద్ షెజాద్ ( Ahmed Shahzad ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును మోసం చేసి ఇంగ్లాండ్ టూర్ కు బాబర్ ఆజం వెళ్లాడని ఫైర్ అయ్యారు. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ సమయంలోనే బాబర్ ఆజంకు గాయమైందని ఆరోపణలు చేశారు. అప్పుడే చేతికి గాయం అయితే… దాచేసాడని మండిపడ్డారు. అదే గాయంతో వెస్టిండీస్ టూర్ కు వెళ్ళాడని ఆగ్రహించారు.

Advertisement

ఇక ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడి మైదానాలు చూసి భయపడిపోయాడని బాంబు పేల్చారు. తన కెప్టెన్సీలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఓడిపోతుందని భయపడిపోయాడని బాబర్ ఆజం పరువు తీశాడు మాజీ క్రికెటర్ అహ్మద్ షెజాద్. బాబర్ ఆజం పరిస్థితి చూస్తుంటే రెండో టెస్టు కూడా ఆడడం కష్టమేనని బాంబు పేల్చాడు. ఈ టోర్నమెంటు నుంచి కూడా వైదొలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలా గాయాలు దాచి పెట్టి.. మోసం చేసే క్రికెటర్ల పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

Related News

2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టెస్ట్ ప్లేయ‌ర్ కంటే దారుణంగా ఆడాడు…కోహ్లీ ప‌రువు తీసిన అక్ష‌ర్ ప‌టేల్!

ఐపీఎల్ లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ వేశాడు..ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాడు !

ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఆడి, ఇంగ్లండ్‌లో.. పాకిస్తాన్ ప‌ళ్లు రాల‌గొట్టుకుంది

పార్టీలు, అమ్మాయిలకు అభిషేక్ శర్మ బానిస అయ్యాడు..యోగ్‌రాజ్ సింగ్ సీరియ‌స్‌

ఐపీఎల్ డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, కెరీర్ నాశ‌నం చేసుకోవ‌ద్దు..పుజారా హెచ్చ‌రిక‌

తొలి టెస్ట్ లో పాకిస్తాన్ అంపైర్…శత్రువైనా టీమిండియాను గెలిపించాడంటూ ఆరోప‌ణ‌లు!

షాహిద్ అఫ్రిదిని కుక్క అంటూ బండ బూతులు తిట్టాను…ఇర్ఫాన్ ప‌ఠాన్ సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×