E-Paper
Advertisement

ఇక నేరుగా గోవాకు వెళ్లిపోవచ్చు, కొత్త వందేభారత్ వచ్చేస్తోంది!

ఇక నేరుగా గోవాకు వెళ్లిపోవచ్చు, కొత్త వందేభారత్ వచ్చేస్తోంది!
Advertisement

Goa Vande Bharat Express: సౌత్ నుంచి గోవాకు వెళ్లే ప్రయాణికులకు త్వరలో మరో  మంచి అవకాశం అందుబాటులోకి రానుంది. బెంగళూరు-గోవా మధ్య నేరుగా వందే భారత్ రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు బెంగళూరులోని యశ్వంత్‌ పూర్ నుంచి బయలుదేరి మంగళూరు మీదుగా గోవాలోని మడ్గావ్ వరకు వెళ్లనుంది. మార్గం మధ్యలో తీరప్రాంత కర్ణాటకలోని పలు కీలక పట్టణాలను కలుపుతుంది. ప్రస్తుతం మంగళూరు సెంట్రల్ నుంచి మడ్గావ్ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ను బెంగళూరులోని యశ్వంత్‌పూర్ వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు కొత్తగా యశ్వంత్‌ పూర్-మడ్గావ్-యశ్వంత్‌ పూర్ సర్వీసు నడిచే అవకాశం ఉంది.

14 స్టేషన్ల మీదుగా ప్రయాణం!

కొత్త వందే భారత్ రైలు మొత్తం 14 స్టేషన్ల మీదుగా వెళ్తుంది. యశ్వంత్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే రైలు శ్రావణబెళగోళ, హాసన్, సకలేష్‌పూర్ మీదుగా తీర ప్రాంతం వైపు వెళ్తుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య రోడ్, కాబక పుత్తూరు, మంగళూరు జంక్షన్, ఉడుపి, కుందపుర, బైందూర్, మురుడేశ్వర్, గోకర్ణ రోడ్, కార్వార్ మీదుగా ప్రయాణించి గోవాలోని మడ్గావ్ చేరుకుంటుంది. దీంతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే కాకుండా, తీరప్రాంత కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా వేగవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

ఇంకా ఖరారు కాని టైమింగ్స్!

Advertisement

ఈ రైలుకు సంబంధించిన అధికారిక టైమ్‌టేబుల్‌ను రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు. అయితే, యశ్వంత్‌పూర్ నుంచి మడ్గావ్ వెళ్లే రైలు ఉదయం 6.05 గంటలకు బయలుదేరి సాయంత్రం 7.15 గంటలకు గోవా చేరుకునే అవకాశం ఉంది. తిరుగు ప్రయాణంలో మడ్గావ్ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.40 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకునే విధంగా షెడ్యూల్ ఉండొచ్చని తెలుస్తోంది. రైల్వే అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత వస్తుంది.

సెప్టెంబర్‌లో ట్రయల్ రన్!

ఈ కొత్త వందేభారత్ సర్వీసుకు సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్లు సమాచారం. సెప్టెంబర్ 10న 16 కోచ్‌లతో కూడిన రైలును యశ్వంత్‌పూర్ నుంచి మంగళూరు జంక్షన్ వరకు నడిపారు. ఈ ప్రయాణానికి వెళ్లే మార్గంలో 7 గంటల 5 నిమిషాలు, తిరుగు ప్రయాణంలో 6 గంటల 49 నిమిషాల సమయం పట్టినట్లు తెలుస్తోంది.

ప్రయాణ సమయం తగ్గించాలని డిమాండ్

Advertisement

ప్రతిపాదిత సర్వీసు బెంగళూరు-మడ్గావ్ ప్రయాణాన్ని మరింత ఈజీ చేయనున్నప్పటికీ, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 13 గంటల సమయం పడే అవకాశం ఉన్నందున దీనిని కనీసం 11 గంటలకు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా మంగళూరు నుంచి బెంగళూరుకు ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల కోసం వెళ్లేవారికి ఉపయోగపడేలా ఉదయం బయలుదేరి, రాత్రికి తిరిగి వచ్చే షెడ్యూల్ ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో మంగళూరు నుంచి రైలు బయలుదేరితే ప్రయాణికులు బెంగళూరులో తమ పనులు పూర్తి చేసుకుని అదే రోజు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని ప్రయాణికుల సంఘాలు చెబుతున్నాయి.

Read Also: రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

Tags

Related News

1975లో పెళ్లి ఖర్చులు.. అమ్మమ్మ లెక్కల చిట్టా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

Big Stories

Advertisement
×