OTT Movie : సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటాము. అయితే కొన్ని సినిమాలలో ఎంటర్టైన్మెంట్ తో పాటు, మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక తండ్రి, కొడుకు చుట్టూ తిరుగుతుంది. ముసలి వయసులో ఉన్న తండ్రి ఆఖరి కోరికను , ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్న కొడుకు ఎలా తీర్చగలుగుతాడనేదే ఈ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
స్టోరిలోకి వెళితే
దయానంద్ కుమార్ కి దాదాపు 77 ఏళ్ల వయసు ఉంటుంది. ఒక రోజు అతనికి ఒక వింత పీడ కల వస్తుంది. అప్పట్నుంచి తనకి మరణం సమీపిస్తున్నట్లు భావిస్తాడు. హిందూ విశ్వాసం ప్రకారం, వారణాసిలో మరణించడం ద్వారా మోక్షం పొందవచ్చని నమ్ముతాడు. అందుకే అతను తన కొడుకు రాజీవ్ ని వారణాసికి తీసుకెళ్లమని కోరతాడు. రాజీవ్ ఒక మధ్యతరగతి ఉద్యోగి. అతను ఒక్కడే కుటుంబ భారాన్ని మొస్తుంటాడు. ఇతనికి భార్య, పెళ్లి కావలసిన కూతురు కూడా ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, తండ్రి కోరికను గౌరవించి, అతను వారణాసి ప్రయాణానికి ఒప్పుకుంటాడు. వాళ్ళు వారణాసిలోని ‘ముక్తి భవన్’ అనే గెస్ట్‌హౌస్‌లో దిగుతారు. ఇది మరణించాలనుకునే వృద్ధుల కోసం, ప్రత్యేకంగా తయ్యారు చేయబడిన హోటల్. ఈ హోటల్‌లో గడపడానికి గరిష్టంగా 15 రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో మరణం సంభవించకపోతే అతిథులు వెళ్లిపోవాలి, లేకపోతే మరో పేరుతో తిరిగి చేరాలి.
ఇక దయానంద్ ఈ హోటల్‌లో చావుకోశం ఎదురుచూస్తాడు. అక్కడ అతను అమల అనే వితంతువుతో స్నేహం చేస్తాడు. తన ఇష్టమైన టీవీ షో ని చూస్తూ జీవితాన్ని మళ్లీ ఆనందించడం మొదలుపెడతాడు. మరోవైపు, రాజీవ్ తన ఉద్యోగ ఒత్తిడి, బాస్ ఫోన్ కాల్స్, ఇంటి నుండి భార్య ప్రశ్నలతో సతమతమవుతాడు. అతని కూతురు సునీత పెళ్లి విషయంలో కూడా ఒత్తిడిలో ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ, దయానంద్ హోటల్‌లో మాత్రం సంతోషంగా ఉంటాడు. ఈ క్రమంలో తండ్రీ కొడుకుల బంధం కొత్త మలుపు తీసుకుంటుంది. చివరికి దయానంద్ కి మరణం వస్తుందా ? మళ్ళీ జీవితం ఆశ పుడుతుందా ? రాజీవ్ ఎలా దీనిని హ్యాండిల్ చేస్తాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : మూడు తరాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్రేజీ కొరియన్ సిరీస్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ మూవీ పేరు ‘హోటల్ సాల్వేషన్’ (Hotel Salvation). అంటే వారణాసిలో దీనిని ముక్తి భవన్ అని పిలుస్తారు. 2016 లో విడుదలైన ఈ మూవీకి శుభాషిష్ భూటియానీ దర్శకత్వం వహించారు. సంజయ్ భూటియాని దీనిని నిర్మించారు. ఇందులో ఆదిల్ హుస్సేన్, లలిత్ బెహ్ల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రంతో సహా నాలుగు నామినేషన్లను అందుకుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.