Ashwin: ఐర్లాండ్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడి… వైట్ వాష్ అయింది. ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (Ireland vs India) మధ్య టి20 సిరీస్ నిన్నటితో ముగిసింది. ఈ సిరీస్ నేపథ్యంలో ఆడిన రెండింటిలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే టీమిండియా ప్రదర్శన పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా స్పందించారు. టీమిండియా క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడే ఫ్లాట్ ట్రాక్స్ కు అలవాటు పడిపోయారని.. అందుకే విదేశీ మైదానాలలో చెత్తగా ప్రదర్శన కనబరుస్తున్నారని మండిపడ్డారు. విదేశీ మైదానాలు 24 క్యారెట్ల ఫ్లాట్ ట్రాకులు (24-carat’ flat wickets) కాదని గుర్తు పెట్టుకోవాలని టీమ్ ఇండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఫ్లాట్ ట్రాక్స్ పైన ఆడటం మానేసి, విదేశీ పిచ్ లకు అలవాటు పడాలని సూచనలు చేశారు. అప్పుడే టీమిండియా ఎలాంటి కండిషన్స్ లో అయినా విజయం సాధిస్తుందని వెల్లడించారు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టి20 సిరీస్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా… వైట్ వాష్ అయింది. పెద్ద జట్టు చేతిలో వైట్ వాష్ అయితే పెద్దగా పట్టించుకునేవారు కాదు.. అనామక ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో టీమిండియాను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇండియన్ మైదానాలలో మాత్రమే ప్లేయర్లు ఆడుతారని పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా దారుణంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు. అయితే ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ ఆడి.. ప్లేయర్ లందరూ ఫ్లాట్ ట్రాక్లకు ( Flat Tracks ) అలవాటు అయ్యారని మండిపడ్డారు. ఒళ్ళు కదలకుండా సిక్సర్లు కొట్టడం నేర్చుకున్నారని చురకలు అంటించారు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ మైదానాలలో టీమిండియా ప్లేయర్లు సరిగ్గా ఆడలేక పోయారని విమర్శలు చేశారు. ఐర్లాండ్ మైదానాలలో బంతులు భయంకరంగా వస్తాయని… ముఖ్యంగా బౌన్సర్లు బ్యాటర్లను వనికిస్తున్నాయని గుర్తు చేశారు. ఇక ఆ బంతులకు టీమిండియా ( Team India) ప్లేయర్లు భయపడి.. వికెట్లు సమర్పించుకుంటున్నారని అశ్విన్ విమర్శలు చేశారు. ఇలా అయితే టీమిండియా మరింత దిగజారడం ఖాయమంటూ ఫైర్ అయ్యారు. ఐపీఎల్ మైదానాలే కాదు… విదేశీ ట్రాక్ల పైన ఆడటం నేర్చుకోవాలని చురకలు అంటించారు. వైభవ్ సూర్యవంశీని రెండో మ్యాచ్ లోనూ ఆడించి ఉంటే, బాగుండని అశ్విన్ అభిప్రాయ పడ్డారు.
Ashwin on India's defeat against Ireland.
– Indian players are accustomed to playing on the '24-carat' flat wickets of the IPL, whenever they face tough conditions at the international level, they will struggle significantly. pic.twitter.com/gtGalvmmqs
— Indian Cricket 🏏 (@navshar54008403) June 28, 2026