Satyabhama Today Episode December 29 th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఎమ్మెల్యే అవుతాను అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఎంత చెప్పినా సత్య వినదు. మనం దూరం పెరుగుతుందని అంటాడు. సత్య పై కోపాన్ని పెంచుకుంటాడు. ఇక మహదేవయ్య లాయర్ తో ఎమ్మెల్యే ఫామ్ ను ఫిల్ అప్ చేయిస్తుంటాడు. అప్పుడే సత్య కిందకి వస్తుంది. సత్య నువ్వు సైన్ చెయ్ అమ్మ నీ చేయి చాలా మంచిది నీకు పట్టుచీర కొని పెడతానని అంటాడు. దానికి క్రిష్ సత్య సైన్ చేయదు బాపు అనేసి అరుస్తాడు. ఏందిరా నువ్వు చెప్పేది ఏం మాట్లాడుతున్నావ్ రా అనేసి బైరవి అడుగుతుంది. నేను చెప్పేది నిజమే బాపుకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిలబడుతుందట అనేసి బైరవితో అరుస్తాడు క్రిష్.. ఇదంతా చూస్తూ మహదేవయ్య సంతోషపడతాడు. ఈ కుండలు బద్దలు కొట్టడమే నాకు కావాలి కోడలు గాని కోడలా అనుకుంటాడు. ఇదంతా చూసి సంతోష్ పడుతున్నావా మావయ్య తెగించేసాను అనే సేమ్ సత్య కూడా మనసులో అనుకుంటుంది. ఒక అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను ఆ అన్యాయాన్ని ఎలాగైనా ఎదిరించాలని అనుకుంటాను కానీ నాకు అధికారం కావాలి అధికారం ఉంటేనే అన్యాయాన్ని ఎదిరించవచ్చని నాకు అర్థమైంది ఈ విషయంలో నా మనసు మార్చుకునేదే లేదు అంటుంది.. ఇక భైరవి మాత్రం చూసావా రా నీ పెళ్ళాం ఎలా మాట్లాడుతుందో కనీసం అత్త మామ అంటే భయం లేదు మొగుడి మాట కూడా వినలేదు ప్రేమించానని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టావు ఇప్పుడు చూడు ఎలా జరిగిందో అనేసి అంటుంది. సత్య ఇలా మొండిగా మాట్లాడుతుంది ఎవరు చెప్తే వింటుందో నాకు తెలుసు అనేసి క్రిష్ అంటాడు. విశ్వనాథం ఇంటికి వచ్చి సత్యతో మాట్లాడుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. సత్య దగ్గరికి విశ్వనాథం వెళ్లి ఏమైంది అంతగా బాధపడుతున్న వెంటమ్మ నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు కానీ నాకు చెప్పుకోలేని బాధలు ఉన్నా చెప్పు అనేసి విశ్వనాథం అడుగుతాడు.. సత్య బాధపడుతూ తన బాధని చెప్తుంది. నోటితో చెప్పలేకున్నా మనసుతో చెప్తున్నా నాన్న అంటుంది. తప్పో ఒప్పో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా నాన్న అంటే..నువ్వు నీ కుటుంబానికి ఎదురు వెళ్లకూడదమ్మా అంటాడు. నిన్ను ఎలా రక్షించుకోవాలో అర్థంకాక టెన్షన్ పడుతున్నా అంటాడు.. పవర్ కావాలి నాన్నా నా జీవితాన్ని కొందరు తొక్కిపెట్టేస్తున్నారు అంటుంది. ఎదురులేదని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటుంది. మనం అనుకున్నవన్నీ జరిగిపోవమ్మా అని సర్దిచెబుతాడు. కానీ సత్య నిర్ణయం వెనక్కు తీసుకోదు…
విశ్వనాథం ఎంత చెప్పినా కూడా సత్య మనసు కరుగదు. ఇంకా నేను తప్పు చెయ్యలేదని వాదిస్తుంది.. అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. చూసారా మామయ్య నేను చెప్పినా వినలేదు. మీరు చెప్పినా వినలేదు. ఏం చెయ్యమంటారు అని అడుగుతాడు. క్రిష్ నేను ఒకసారి నిర్ణయాలు తీసుకుంటే మార్చుకొను. నేను ఎమ్మెల్యే గా పోటీ చేస్తాను తెగేసీ చెబుతుంది. ఎమ్మెల్యే గా పోటీ చేస్తాను తెగేసీ చెబుతుంది. క్రిష్ మాత్రం బాధ పడతాడు.. మన గురించి ఆలోచిస్తున్న నీకు నేను అవసరం లేదు. కానీ నాకు నువ్వు ముఖ్యం. నువ్వంటే ప్రాణం. నిన్ను దూరం చేసుకొని నేను బ్రతకలేను అని ఎంతగా చెప్పిన సత్య వినదు.. ఇక క్రిష్ కోపాన్ని పెంచుకుంటాడు. ఇక రేణుక కూడా సత్యకు నచ్చ చెప్తుంది. కానీ మాట వినదు. సత్య ఎమ్మెల్యే అవ్వడానికి ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది. క్రిష్ వస్తే సత్యకు దూరంగా ఉంటాడు. ఇక మహాదేవయ్య కు వడ్డించేందుకు వచ్చిన సత్యను నిలదీస్తుంది భైరవి.. ఎవరి మాటా వినని నీ భార్యని పుట్టింటికి పంపించెయ్ అంటుంది.. క్రిష్ నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి… ఇక మైత్రి మాత్రం హర్షకు ఎలా దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తుంది. సోమవారం ఎపిసోడ్ లో మహాదేవయ్య సత్యకు సపోర్ట్ చేస్తాడేమో చూడాలి…