E-Paper
Advertisement

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత
Advertisement

Kissik Talks Supritha bandaru: సోషల్ మీడియా లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సుప్రీతా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ నటీమణి సురేఖ వాణి (Surekha Vani) కూతురు. ముఖ్యంగా కరోనా సమయం నుండి ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ కి మరింత చేరువయ్యారు. ఒకవైపు తమ గ్లామర్ షో తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే నెటిజన్స్ నుండి విపరీతమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే అవేవీ పట్టించుకోకుండా తమ కెరియర్లో ముందుకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని సరదాగా గడిపేస్తున్నారు.

నా జీవితంలో మళ్లీ అలాంటి రోజు వద్దు..

ఇకపోతే పైకి సంతోషంగా ఉన్నా వారి జీవితంలో ఎన్నో విషాద ఘటనలు ఉన్నాయని , ముఖ్యంగా తన ఆరోగ్యం విషయంలో తాను పడుతున్న ఇబ్బందుల గురించి తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చి అందులో చెప్పుకొచ్చింది సుప్రీత. జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని ఏదైనా ఉందా? అని వర్ష అడగగా.. మా నాన్న చనిపోయిన రోజు.. మళ్ళీ రాకూడదని కోరుకుంటాను అంటూ చెప్పింది సుప్రీత.

నన్ను చంపేయి దేవుడా అని కోరుకున్నాను..

Advertisement

అది కాకుండా మీ జీవితంలో అలాంటి రోజు ఏదైనా ఉందా? అని అడగగా.. ఉంది అంటూ సుప్రీత మాట్లాడుతూ.. ఏదైనా నేను ఒక వినకూడని మాట లేదా ఒక బ్యాడ్ మాట విన్నప్పుడు నా శరీరం ఒక్కసారిగా వణికి పోతుంది. అసలు హార్ట్ ఎటాక్ వచ్చినంత భావన కలుగుతుంది . ఆ నరకం భరించలేను. అప్పుడే కోరుకుంటాను నన్ను నన్ను చంపేయ్ లేదా తీసుకెళ్లి పో అని.. అయితే ఈ సమస్య నాకు ఏ కారణం చేత? ఎందుకు? ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నేనైతే ఎప్పుడైనా ఏదైనా వినకూడని మాట , చూడకూడని సంఘటన చూసినప్పుడు నా శరీరం మొత్తం వణికిపోతుంది. ఆ సమయంలో నరకం అనుభవిస్తాను అంటూ తన సమస్య గురించి చెప్పుకొచ్చింది సుప్రీత.

సెలబ్రిటీ కష్టాలు ఎవరికీ కనబడవు..

అలాగే తెరపై కనిపించేదంతా ఆడియన్స్ కి మన నవ్వులు మాత్రమే.. కానీ తెర వెనుక మనం పడే కష్టాలు వాళ్లకు తెలియదు. అందుకే మనం సంతోషంగా ఉంటామని అందరూ అనుకుంటారు అంటూ కూడా చెప్పుకు వచ్చింది. ఏది ఏమైనా సుప్రీతా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ ఆరా తీస్తున్నారు.

Advertisement

also read: సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

నేను చాలా రొమాంటిక్..

ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో నేను చాలా రొమాంటిక్. కానీ చాలామంది నన్ను రౌడీ అనుకుంటున్నారు. కానీ నేను చాలా రొమాంటిక్ సరైన వ్యక్తి దొరకలేదు. కానీ నేనైతే పక్కా రొమాంటిక్ అన్ని సరదాగా కామెంట్ చేసింది సుప్రీత. మొత్తానికి అయితే సుప్రీత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×