Hasan Nawaz Warns Team India: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా అదరగొట్టిన పాక్ యంగ్ క్రికెటర్ హసన్ నవాజ్ ( Hasan Nawaz Warns Team India)..టీమిండియా వార్నింగ్ బెల్స్ పంపాడు. తనకు టీమిండియా బౌలర్లంటేనే అసహ్యమని, అందుకే ఫైనల్స్ సందర్భంగా చితకబాదాను అంటూ హసన్ నవాజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టీమిండియాపై సెంచరీ కూడా సాధిస్తానని శపథం చేశాడు. అల్లా మీదు ఒట్టేసి చెబుతున్నా, టీమిండియాపై ఎన్నటికైనా సెంచరీ చేసి.. పాకిస్తాన్ కు విజయం అందిస్తానని సవాల్ విసిరారు. అప్పటి వరకు నిద్రపోను అంటూ వ్యాఖ్యానించారు. టీమిండియా బౌలర్లను చితక బాదడంలో ఉన్న కిక్కు, ఎందులో ఉండబోదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో టీమిండియాపై హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా పాక్ యంగ్ క్రికెటర్ హసన్ నవాజ్ ( Hasan Nawaz ) ఇరగదీశాడు. బంగ్లాదేశ్ పై కీలక ఇన్నింగ్స్ ఆడిన హసన్ నవాజ్, ఫైనల్స్ లోనూ టీమిండియాకు చుక్కలు చూపించాడు. 51 బంతుల్లోనే 96 పరుగులు చేసి దుమ్ములేపాడు. సిక్సర్లు, బౌండరీలు బాది టీమిండియా బౌలర్లను బెంబెలెత్తించేశాడు. ఈ దెబ్బకు ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాపై పాకిస్తాన్ విజయం సాధిస్తుందని అనుకున్నారు. అంతలా మ్యాచ్ లో హైప్ పెంచాడు. కానీ హసన్ నవాజ్ కు ఇతర బ్యాటర్ల నుంచి సరైన సపోర్ట్ రాలేదు. దీంతో మ్యాచ్ ఓడిపోయింది. లేకుంటే, కచ్చితంగా టీమిండియాను ఓడించేవాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇదే ఊపులో టీమిండియా హసన్ నవాజ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భయంకరంగా తయారైన హిట్టర్ హసన్ నవాజ్ వయస్సు 24 ఏళ్లు. 2025లోనే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లోనే హసన్ నవాజ్ అరంగేట్రం చేశాడు నవాజ్. ఇక తన మూడో మ్యాచ్ లోనే 45 బంతుల్లోనే సెంచరీ చేసి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో చిన్న వయస్సులోనే టీ20 సెంచరీ చేసిన పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ గా హసన్ నవాజ్ రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లోనూ పలు జట్లకు ఆడిన అనుభవం మనోడికి ఉంది. ఇస్లామాబాద్, క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడిన హసన్ నవాజ్ ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఒకటి, రెండు మ్యాచ్ ల్లో విఫలమైనందుకు అతడిని పక్కకు పెట్టారు. కానీ మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చేశాడు.