E-Paper
Advertisement

మేడిపల్లి క్యారెట్ లేన్ షాపులో భారీ చోరీ.. రూ. 2 కోట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు!

మేడిపల్లి క్యారెట్ లేన్ షాపులో భారీ చోరీ.. రూ. 2 కోట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు!
Advertisement

CaratLane Robbery: హైదరాబాద్- వరంగల్‌ జాతీయ రహదారిపై ఉండే క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

షట్టర్ వంచి, గ్లాస్ పగలగొట్టి..

Advertisement

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రసిద్ధ క్యారెట్ లేన్ షోరూమ్‌ లక్ష్యంగా ఈ దొంగతనం జరిగింది. దుండగులు పక్కా పథకం ప్రకారమే షాప్ షట్టర్‌ను వంచి లోపలికి చొరబడ్డారు. ఆ తర్వాత లోపల ఉన్న డిస్‌ప్లే గ్లాస్‌లను పగలగొట్టి, విలువైన డైమండ్ ఆభరణాలను ఊడ్చేసి క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు.

రంగంలోకి క్లూస్ టీమ్స్, ఎస్‌వోటీ

Advertisement

ఉదయాన్నే చోరీ జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, మేడిపల్లి ఏసీపీ మోహన్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ జలంధర్‌ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ బృందాలు అక్కడ లభించిన ఆధారాలను సేకరించాయి.

ఫుటేజీ పరిశీలన.. దర్యాప్తు వేగవంతం

దుండగులు ఏ దారిలో వచ్చారు, చోరీ పూర్తయ్యాక ఏ మార్గంలో పరారయ్యారనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ ముగిశాక వెల్లడికానున్నాయి.

Also Read: ఓట్ల చోరీ.. జేబీ చోరీ.. కేంద్రంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

ఖైరతాబాద్‌పై కన్నేసిన తలసాని.. బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్ ఎదురైందా?

KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?

రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

Big Stories

Advertisement
×