E-Paper
Advertisement

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.5.17 కోట్లు స్వాహా

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.5.17 కోట్లు స్వాహా
Advertisement

Stock Market Scam: సోషల్ మీడియా వేదికగా నిత్యం ఎక్కడోచోట సైబర్ కేటుగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఎగబడిన మోసగాళ్లు, ఏకంగా ఇద్దరి నుంచి రూ.5.17 కోట్లు కొల్లగొట్టారు.

మణికొండలో మహిళకు నకిలీ యాప్ వల

Advertisement

మణికొండ ప్రాంతానికి చెందిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు తమ మాయమాటలతో నమ్మించారు. ఆమె ఫోన్‌లో ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ఆ యాప్‌లో ఆమె పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు రూ.4.14 కోట్ల వర్చువల్ బ్యాలెన్స్‌ను చూపించారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, అసలు మోసం బయటపడింది. లాభాలు తీసుకోవాలంటే పన్నులు, ఫీజుల పేరుతో మరో రూ.80 లక్షలు చెల్లించాలని కేటుగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనలో ఆమె ఏకంగా రూ.2.85 కోట్లు కోల్పోయింది.

వాట్సాప్ గ్రూపుల ద్వారా కర్మన్‌ఘాట్ వ్యాపారికి టోకరా

Advertisement

ఇదే తరహాలో కర్మన్‌ఘాట్‌కు చెందిన ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా పరిచయం చేసుకున్న కొందరు వ్యక్తులు తాము స్టాక్ మార్కెట్ నిపుణులమని నమ్మబలికారు. తాము సూచించిన విధంగా ట్రేడ్ చేస్తే తక్కువ సమయంలోనే కోట్లలో లాభాలు వస్తాయని ఆశ చూపించారు. ఇతరులు సంపాదించినట్లుగా నకిలీ స్క్రీన్‌షాట్లను చూపిస్తూ బాధితుడితో విడతలవారీగా రూ.2.32 కోట్లు పెట్టుబడి పెట్టించారు. చివరికి ఆ డబ్బును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా, ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అప్రమత్తతే రక్షణ

ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే స్టాక్ మార్కెట్ ప్రకటనలు, వాట్సాప్ ట్రేడింగ్ గ్రూపుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధిక లాభాల ఆశ చూపే నకిలీ యాప్‌లను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.

Also Read: ‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

Tags

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మహర్దశ: ఏ జిల్లాకు ఎన్నెన్ని కోట్లు మంజూరయ్యాయంటే..?

పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?

రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!

ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!

ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి.. ఫేక్ వీడియోలపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×