E-Paper
Advertisement

క‌ళ్లు మూసుకుని ఆడ‌టం కాదు, అమీర్ బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడు…అభిషేక్ పై బాసిత్ ప్ర‌శంస‌లు

క‌ళ్లు మూసుకుని ఆడ‌టం కాదు, అమీర్ బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడు…అభిషేక్ పై బాసిత్ ప్ర‌శంస‌లు
Advertisement

Basit Ali On Abhishek Sharma:  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన బ్యాటర్ గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇండోర్ వేదికగా అర్థ సెంచరీ నమోదు చేసుకొని ఈ చరిత్ర క్రియేట్ చేశాడు. అయితే అభిషేక్ శర్మ ఈ రికార్డు సృష్టించిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేస్తాడని అభిషేక్ శర్మ పై అనవసరంగా కొంత మంది విమర్శలు చేశారని మండిపడ్డారు. నిజంగానే అభిషేక్ శర్మ స్లాగర్ అయితే 200 పరుగులు చేస్తాడు.. కానీ 2000 పరుగులు ఎలా ? సాధ్యమంటూ మహమ్మద్ అమీర్ కు కౌంటర్ ఇచ్చారు. అలాంటి విమర్శలు చేసే వాళ్ళకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అభిషేక్ శర్మ పై బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అస‌లు అభిషేక్ శ‌ర్మ‌ను మ‌హ్మ‌ద్ అమీర్ ఏమ‌న్నాడంటే ?

టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ పై అప్పట్లో మహమ్మద్ అమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ పెద్ద స్లాగర్ అంటూ పరువు తీశాడు. కళ్ళు మూసుకుని బ్యాటింగ్ చేస్తాడని, బ్యాట్ పైకి బంతులు వస్తేనే కొడతాడని బాంబు పేల్చాడు. అంతే తప్ప వాడికి ఆట చేత కాదని హేళన చేశారు. ఫ్లాట్ మైదానాల పైన మాత్రమే ఆడతాడని సెటైర్లు వేశారు. అయితే అభిషేక్ శర్మ పై మహమ్మద్ అమీర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా బాసిత్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కళ్ళు మూసుకుని ఆడడం కాదు మహమ్మద్ అమీర్ బట్టలు ఊడదీసి కొట్టాడని అభిషేక్ శర్మ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

ఒక్కసారి భూతద్దాలు పెట్టుకొని అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూడాలని కౌంటర్ ఇచ్చారు. అప్పుడే అతడి ప్రతాపం ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కళ్ళు మూసుకుని ఆడేవాడు అయితే 200 లేదా 300 పరుగులు చేసేవాడని వివరించారు. అభిషేక్ శర్మ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు కాబట్టే 2000 పరుగులు పూర్తి చేశాడని ప్రశంసించారు. ఎవరు సాధించలేని రికార్డు అతడు క్రియేట్ చేసుకున్నాడని తెలిపారు. కచ్చితంగా 200 స్ట్రైక్ రేట్ మైంటైన్ చేస్తూ స్థిరంగా పరుగులు చేయడం కారణంగానే ఈ రికార్డు సాధ్యమైంది అన్నారు. అలాంటోడిని కళ్ళు మూసుకుని ఆడుతున్నాడని అనడం చాలా తప్పు అంటూ మండిపడ్డారు. మహమ్మద్ అమీర్ కు బ్యాటింగ్ పైన ఎలాంటి అవగాహన లేదని.. అందుకే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

అందరూ ద‌ద్ద‌మ్మ‌లే.. ప‌ర్స‌న‌ల్ రికార్డుల కోస‌మే ఆడి, పాకిస్తాన్ కొంప‌ముంచుతున్నారు

టీమిండియా మ్యాచ్ లు వీడియో గేమ్ లాగా త‌యార‌య్యాయి..సిక్సుల వ‌ర్షమే

గంభీర్, శ్రేయాస్ అయ్య‌ర్ మ‌ధ్య విభేదాలు…న‌మ‌న్ ధీర్ వ‌ద్దేవద్దంటూ గొడ‌వ‌ !

స్కూల్ కు వెళ్లే పిల్లాడివా? తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్ పై సునీల్ గ‌వాస్క‌ర్ ఫైర్‌

మాజీ క్రికెటర్ల అల్లుళ్లు, రాజకీయ నాయకుల కొడుకులతో పాకిస్తాన్ కంపుకొడుతోంది

తిల‌క్ వ‌ర్మ వివాద‌స్ప‌ద ర‌నౌట్…విండీస్ పై టీమిండియా బిగ్ విక్ట‌రీ

శ్రేయస్ అయ్య‌ర్ వికెట్ పై వివాదం…క‌న్నీళ్లు పెట్టుకున్న లేడీ ఫ్యాన్

Big Stories

Advertisement
×