New Fitness Rules To Team India: ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా క్రికెటర్లు.. ఈ మధ్య గాయాలపాలు అవుతున్నారు. గాయాలు అయిన వాళ్లకే మళ్లీ మళ్లీ అవే సమస్యలు తెరపైకి వస్తున్నాయి. బుమ్రా, పాండ్యా, రాణా, నితీశ్ కుమార్ రెడ్డి తరచూ గాయాల పాలు అవుతున్నారు. ఇటీవల హర్షిత్ రాణా ( Harsiht Rana) 97 కేజీలు పెరిగిన సంఘటన కూడా వివాదంగా మారింది. బెంగళూరు ట్రైనింగ్ సెంటర్ కు వెళ్లిన ప్రతి ఒక్క ప్లేయర్ బరువు పెరగడం కూడా హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ సమస్యలపై బీసీసీఐ ( BCCI) పెద్దలు స్పెషల్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఇకపై కొత్త ఫిట్నెస్ రూల్స్ అమలు చేయాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు టీమిండియా క్రికెటర్లకు బ్రాంకో టెస్ట్ (Bronco Test) మాత్రమే నిర్వహించేవాళ్లు. ఇకపై ఈ బ్రాంకో టెస్ట్ తో పాటు 2k రన్ నిర్వహించేందుకు BCCI పెద్దలు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు.
టీమిండియా క్రికెటర్లకు ఇకపై కొత్త ఫిట్నెస్ పరీక్షలు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. దీని ప్రకారం యూనిఫారం బ్రాంకో టెస్ట్ తో పాటు 2k పరుగు కూడా నిర్వహించనున్నారు. బ్రాంకో టెస్ట్ ప్రకారం…ప్రతి ఆటగాడు ఐదు నిమిషాల 15 సెకండ్ల నుంచి ఐదు నిమిషాల 20 సెకండ్ల లోపు 20 మీటర్లు, 40, 60 మీటర్ల పరుగులు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం ఐదు సెట్ల పరుగు పూర్తి చేయాలి. అంటే ఓవరాల్ గా 1200 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. గతంలో ఈ 1200 మీటర్లను ఆరు నిమిషాల సమయంలో పూర్తి చేయాలనే కండీషన్ బీసీసీఐ పెట్టింది. అయినప్పటికీ ప్లేయర్ల ఫిట్నెస్ సరిగ్గా ఉండకపోవడంతో… ఆ సమయాన్ని కుదించారు. ఇక నుంచి 5.15 నిమిషాల నుంచి 5.20 నిమిషాల వ్యవధిలోనే ఈ 1200 మీటర్ల బ్రాంకో టెస్ట్ ఫినిష్ చేయాలి. బ్రాంకో టెస్ట్ పూర్తయిన వెంటనే ఆటగాళ్లు ఎలాంటి సుదీర్ఘ విరామం తీసుకోకుండా రెండు కిలో మీటర్ల పరుగును 9 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు అదనంగా అమలు చేయబోతున్నారు.
ఫిట్నెస్ పరీక్షల్లో సీనియర్ క్రికెటర్లకు గతంలో కొంత వెసులుబాటు ఇచ్చేవారు. ఇకపై అలాంటి మినహాయింపులు ఏవి ఉండబోవు అని తాజాగా బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ బ్రాంకో టెస్ట్ తో పాటు రెండు కిలో మీటర్ల పరుగును కూడా ఫినిష్ చేయాలని వెల్లడించింది. 2027 వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును కొత్త ఫిట్ నెస్ పరీక్షల ద్వారానే ఫైనల్ కూడా చేయనున్నారట.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు