Jogi Ramesh Interview: వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్.. ఏపీ రాజధాని విషయంలో ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మూడు రాజధానుల నిర్ణయం కూడా.. ఓటమిలో ఒక భాగమే అని ఆయన తెలిపారు. బిగ్ టీవీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలను విశ్లేషించారు. ఈ నేపథ్యంలో జోగి రాజధాని విషయంలో తమ పార్టీకి భిన్నంగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి నెలకొంది.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏపీ రాజధాని విషయంలో.. వైసీపీ పార్టీ పునరాలోచన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తమ పార్టీ అధినేతతో చర్చిస్తామన్నారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే.. మూడు రాజధానులను తీసుకొచ్చామని జోగి రమేష్ అన్నారు. కానీ ఆ నిర్ణయం రాష్ట్రప్రజలకు నచ్చలేదని తెలిపారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అమరావతిని అభివృద్ధి చేస్తామని జోగి చెప్పుకొచ్చారు. తమ పార్టీ నాయకుడు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. తాము చెప్పినట్లుగా చంద్రబాబు విశాఖ ఆర్ధిక రాజధాని అంటున్నారని గుర్తు చేశారు. తాము అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం విశాఖను ఒక రాజధానిగా చేసిందన్నారు.
సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. జగన్ పాలన ఉంటే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారని జోగీ అన్నారు. రానున్న కాలంలో ప్రజా ఉద్యమం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏ వాగ్ధానం అమలు చేసింది? సంవత్సర కాలంలో తల్లికి వందనం ఏమైంది? అమరావతి విషయంలో ఇంకా గ్రాఫిక్స్ చూపిస్తే ఎలా? అప్పులు ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలియదా? ఆర్థికంగా కుంగిపోయాం అంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read: వేశ్యల రాజధాని వ్యాఖ్యల వెనుక భారతి రెడ్డి హస్తం ఉందా!! అనిత సంచలన కామెంట్స్
మాకు మూడు పార్టీలు లేవు.. ఉన్నది ఒక్కటే పార్టీ.. ఒక్క లీడర్‌ను ఓడించడానికి మూడు పార్టీలు కలిశాయంటే గర్వమే.. అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పరిపాలన కోసం అధికారం ఇస్తే.. రెడ్‌బుక్ వేధింపులేంటి? చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లలేదు.. నిరసనకే వెళ్లాం. చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చాలా తప్పు.. మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నన్ను నిలదీశారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం YCPకి మైనస్ అని జోగి రమేష్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీపై ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తోంది. అధికారం శాశ్వతం కాదు.. రెడ్‌బుక్, బ్లూబుక్‌లను నేను హర్షించను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.