Abhishek Anand Japan Cricketer: ఆసియా క్రీడాల 2026 నేపథ్యంలో టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య రేపు బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 1 గంటలకు షురూ కానుంది. ఇలాంటి తరుణంలోనే వైభవ్ సూర్యవంశీ తరహాలోనే మరో బిహార్ కుర్రాడు అభిషేక్ ఆనంద్ తెరపైకి వచ్చాడు. ఈ అభిషేక్ ఆనంద్..బిహార్ లోనే పుట్టి, పెరిగాడు. కానీ ఇప్పుడు జపాన్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. మంగళ వారం రోజున టీమిండియా జరిగే మ్యాచ్ లోనూ మన ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. దీంతో అభిషేక్ ఆనంద్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.
అభిషేక్ ఆనంద్…బీహార్ లోని రోహతాస్ జిల్లాకు సంబంధించిన వాడు. ఐఐటీ కాన్పూర్ నుంచి కెమిస్ట్రీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఫినిష్ చేశాడు. అదే సమయంలో కాలేజ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా పని చేశాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం ఉన్న తరుణంలో అదే బాటలో వెళ్లాడు అభిషేక్ ఆనంద్. అయితే, ఉద్యోగం నిమిత్తం, 2022లోనే జపాన్ వెళ్లిపోయాడు. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ద్వారా అతనికి జపాన్ లో ఉద్యోగం వచ్చింది. టోక్యోలోనే జాబ్ చేస్తూ, జీవనం కొనసాగించాడు. జపాన్ లోనే జాబ్ చేస్తూ, వీకాఫ్స్ ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడు. ఈ క్రమంలో క్లబ్ క్రికెట్ నుంచి దేశవాళి దాకా వెళ్లాడు. ఈ తరుణంలోనే సెలక్టర్ కంట పడ్డాడు. దీంతో జపాన్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
జపాన్ జాతీయ జట్టు తరఫున్ ఆడుతోన్న అభిషేక్ ఆనంద్…2025 మేలో అంతర్జాతీయ టీ20లలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐలాండ్స్ వర్సెస్ జపాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో బరిలోకి దిగి, అందరినీ ఆకట్టుకున్నాడు అభిషేక్ ఆనంద్. ఈ అభిషేక్ ఆనంద్ మంచి ఆల్ రౌండర్. ఇతను రైట్ హార్మ్ బ్యాటర్ కాగా, మీడియం పేస్ బౌలర్. ఇప్పటి వరకు జపాన్ తరఫున 18 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఒకే ఒక అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. హైయెస్ట్ స్కోర్ 55 పరుగులు మాత్రమే. అలాంటి అభిషేక్ ఆనంద్.. టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య ఆడే మ్యాచ్ లో ఛాన్సు ఉందని అంటున్నారు. అంతేకాదు, ఈ మ్యాచ్ తరుణంలోనే తన బీహారీ సోదరులు వైభవ్, ఇషాన్ కిషన్ లను (Ishan Kishan) కలుస్తానని చెప్పుకొచ్చాడు అభిషేక్ ఆనంద్. వాళ్లను కలిసి, బీహార్ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్న్ తెలిపారు. దీంతో అభిషేక్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.