Dhanashree Verma: భారత క్రికెటర్ యుజువేంద్ర చాహల్ – అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. ఈ జంట ఇక విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజమెంతుంది అనే దానిపై అధికారిక సమాచారం లేదు. అయితే చాహల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి తన భార్య ధనశ్రీ ఫోటోలను తొలగించడం, వీరిద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడంతో ఈ రూమర్స్ గట్టిగా వైరల్ అవుతున్నాయి.
Also Read: Sania Mirza: సానియా మీర్జా కొత్త ప్రయాణం..ఇక రచ్చ రచ్చే!
అంతేకాదు వీరు గత ఆరు నెలలుగా వేరువేరుగా ఉంటున్నారని జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రసారం అవుతున్నాయి. వీరు ఇప్పటికే తమతమ న్యాయవాదులను సంప్రదించారట. త్వరలోనే మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటారని సమాచారం. ఇంతకాలం అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట ఇప్పుడు అనూహ్యంగా విడిపోతున్నారని తెలిసిన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే వీరి పచ్చని కాపురంలో ఓ వ్యక్తి చిచ్చుపెట్టాడని.. అతని కారణంగానే ఈ జంట విడాకులు తీసుకోబోతుందని సోషల్ మీడియాలో ఓ ఫోటో తో సహా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. చాహల్ భార్య ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ఓ కొరియోగ్రాఫర్ మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ధనశ్రీ.. తన డాన్స్ వీడియోలు, రీల్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ధనశ్రీ కొంతకాలంగా ఓ కొరియోగ్రాఫర్ తో చనువుగా ఉంటుందట.
ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అతని పేరు ప్రతీక్. 2024 సంవత్సరంలో హిందీ పాపులర్ డ్యాన్స్ షో “జలక్ దికలాజ” లో కంటెస్టెంట్ గా బరిలోకి దిగారు. ఫైనల్ లో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ తో ధనశ్రీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటో అప్పట్లో వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే భర్తను మోసం చేస్తూ ఇలాంటి పనులు చేయడం సరైంది కాదని.. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని నేటిజెన్లు హితబోధ చేశారు.
ఈ ఫోటో పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో ధనశ్రీ ఆ ఫోటోను డిలీట్ చేసింది. అప్పటికే ఈ ఫోటో వైరల్ గా మారడంతో చాహల్ తన భార్య ధనశ్రీని హద్దుల్లో ఉండాలని మందలించాడట. ఇక అప్పటినుండే వీరి మధ్య దూరం పెరిగిందని.. ఇక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో గతంలో ధనశ్రీ – ప్రతీక్ దిగిన ఫోటో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
Also Read: WTC Cycle 2025-27 Schedule: WTC 2025-27లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసింది ?
దీనిపై చాహల్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అతడి కారణంగానే ఈ జంట విడాకులు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత కొంతకాలంగా చాహల్ కి భారత జట్టులో చోటు దక్కడం లేదన్న విషయం తెలిసిందే. చాహల్ ఫామ్ లో ఉన్న సమయంలోనే జట్టులో అవకాశాన్ని కోల్పోయాడు. ఇప్పుడు జట్టులో ప్లేస్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. అతడు చివరగా గత ఏడాది ఆగస్టులో వెస్టిండీస్ పై t-20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత భారత భారత జట్టుకు దూరమయ్యాడు.