BigTV English

Champions Trophy Semis 1:ట్రావిస్ హెడ్ కు స్కెచ్.. 5 స్పిన్నర్లతో టీమిండియా..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?

Champions Trophy Semis 1:ట్రావిస్ హెడ్ కు స్కెచ్.. 5 స్పిన్నర్లతో టీమిండియా..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?

Champions Trophy Semis 1:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy Semis ) నేపథ్యంలో… మంగళవారం బిగ్ ఫైట్ జరగనుంది. ఈ టోర్నమెంట్ తుది దశకు రావడంతో… అందరూ సెమీ ఫైనల్ పైన.. కన్నేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మార్చి 4 అంటే మంగళవారం రోజున… టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. దుబాయ్ వేదికగా జరగబోతున్న ఈ సెమీఫైనల్ కోసం ఇప్పటినుంచి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్లోకి వెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది టీమిండియా.


Also Read: Kohli – Axar: అక్షర్‌ కాళ్లు మొక్కిన కోహ్లీ..అనుష్క సీరియస్ రియాక్షన్‌ ?

సెమీ ఫైనల్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?


మొదటి సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారత కాల మానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల లోపే ఈ మ్యాచ్ పూర్తవుతుంది. దుబాయిలో ఎలాంటి వర్షం పడే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. వర్షం పడినా కూడా రిజర్వ్ డే ఉంటుంది. కాబట్టి ఇలాంటి టెన్షన్ ఉండదు.

ఇక టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచును జియో హాట్ స్టార్ లో ఉచితంగా మనం చూడవచ్చు. జియో నెట్వర్క్ ఉన్న వాళ్ళందరికీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది రిలయన్స్. జియో హాట్ స్టార్ ఒకటే కాకుండా స్పోర్ట్స్ 18 అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా మనం మ్యాచ్ చూడవచ్చు.

ఐదుగురు స్పిన్నర్లు

ఆస్ట్రేలియాను ఈ మ్యాచ్లో ఓడించాలంటే ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగాలని రోహిత్ శర్మ అనుకుంటున్నారట. ఐదు మంది స్పిన్నర్లతో బౌలింగ్ చేయాలని అనుకుంటున్నారట. దీనికోసం మహమ్మద్ షమీని తుది జట్టులో తొలగిస్తారని కూడా చర్చ జరుగుతుంది. లేదా మొన్నటి లాగా షమీ అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు… ఫేస్ బౌలింగ్ చూసుకుంటారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ విభాగం చూసుకుంటారు. అదనంగా రోహిత్, విరాట్ కోహ్లీ, ఇలా ఎవ్వరైనా బౌలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇద్దరు కూడా స్పిన్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఈ లెక్కన మొత్తం ఐదు మంది స్పిన్నర్లతో టీమిండియా బర్లోకి దిగబోతుందన్నమాట.

Also Read: Travis Head: సెమీస్‌ పోరు..ఇండియాను వణికిస్తున్న కుంభకర్ణుడు..గెలవడం కష్టమేనా?

ఇరు జట్లు

టీమ్ ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి

ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×