E-Paper
Advertisement

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !
Advertisement

Chef Sachin Sangwan On Dhoni: మహేంద్ర సింగ్ ధోని… టీమిండియా తరవాత మార్చిన రియల్ హీరో. మిస్టర్ కూల్ గా పేరుగాంచిన మహేంద్రుడు… 2007 నుంచి దాదాపు పది సంవత్సరాల పాటు టీం ఇండియాను కెప్టెన్ స్థాయిలో ఏలాడు. ఈ క్రమంలో అనేక ట్రోఫీలు అందించి… టీమిండియాను అగ్ర శిఖరాన నిలబెట్టాడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోనీపై ప్రముఖ చెఫ్‌ సచిన్ సంగ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీకి చాలా సార్లు తాను స్వ‌యంగా వండి, వడ్డించాన‌ని గుర్తు చేశారు. ఈ త‌రుణంలోనే అతడు తినే ఫుడ్ లో కొంచెం సాల్ట్ తక్కువైనా లేదా ఎక్కువైనా క్లాస్ పీకుతాడని వ్యాఖ్యానించారు.

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

కానీ అక్కడి మేనేజర్ లేదా హోటల్ యాజమాన్యానికి ఎలాంటి ఫిర్యాదు చేయబోడని.. తప్పు చేసిన వాళ్లకు మాత్రమే చెప్పి… రిపీట్ కాకూడదని వార్నింగ్ ఇస్తాడని సచిన్ సంగ్వాన్ గుర్తు చేశారు. గ‌ట్టిగానే క్లాస్ పీకుతాడ‌న్నారు. సాధారణంగా ఇతర క్రికెటర్లు, రాజకీయ నాయకులు మాత్రం ధోనీ లాగా ఆలోచించకుండా… నేరుగా హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ మహేంద్రసింగ్ ధోని మాత్రం సదరు ఉద్యోగి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడని ప్రశంసించారు. అలాంటోడు టీమిండియా కెప్టెన్ కావడం అందరి అదృష్టం అన్నారు. త‌ప్పులు చేయ‌డం స‌హ‌జ‌మే, తాను కూడా గ్రౌండ్ లో త‌ప్పులు చేస్తాన‌ని చెబుతాడ‌ని వెల్ల‌డించారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

మ‌హేంద్ర సింగ్ ధోనికి ఇష్ట‌మైన ఫుడ్స్ ఇవే

మహేంద్ర సింగ్ ధోని ఇష్టపడి తినే ఆహారాల గురించి చెఫ్ సచిన్ సంగ్వాన్ కీలక విషయాలను పంచుకున్నారు. టిఫిన్ సందర్భంగా దోశ, చీజ్ చిల్లి టోస్ట్… లేదా సింపుల్ బ్రేక్ ఫాస్ట్ ధోని ఇష్టపడతాడని వివరించారు. లంచ్ సమయంలో బట్టర్ చికెన్, బటర్ మసాలా చికెన్ అంటే అతడికి ఇష్టమని తెలిపారు. పాస్తా, ఫిష్ కర్రీ కూడా ధోని ఇష్టంగా తింటాడని పేర్కొన్నారు. ధోని ఏ నగరానికి వెళ్లినా అక్కడి లోకల్ ఐటమ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తాడని పేర్కొన్నారు. మహేంద్ర సింగ్ ధోని గొప్ప వ్యక్తి కాబట్టి అతని లైఫ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుందని అందరూ అనుకుంటారు.. కానీ ఒక సాధారణ పౌరుడిలాగానే అతడి జీవనశైలి ఉంటుందని వివరించారు. హోటల్ రూమ్ నుంచి బయటకు జాలిగా గ‌డిపేందుఉ వెళ్లే క్రమంలో కూడా సింపుల్ టీషర్ట్స్ ధరించి చిల్ అవుతూ ఉంటారు. ఆర్భాటాలు లేకుండా అతని వస్త్ర ధారణ ఉంటుందని వివరించారు. అందుకే ధోని అంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తార‌ని వెల్ల‌డించారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

ఒరేయ్ పొట్టోడా? పాట్ కమ్మిన్స్‌ను గెలకకు…టాప్ లేచిపోతుంది

ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

నీతులు చెబుతారు కానీ, పాకిస్తాన్ వెధవలందరూ డ్ర‌గ్స్ తీసుకుంటారు!

రాజ‌కీయ నాయ‌కుడిలా టీమిండియాపై గంభీర్ పెత్త‌నం చేలాయిస్తున్నాడు !

ఆ ఒక్క‌డు లేక‌పోతే, జింబాబ్వే చేతిలోనూ టీమిండియా ఘోరంగా ఓడిపోతుంది

మీకు అభిషేక్ ఉంటే, మాకు మాజ్ సదాకత్.. ఇక చూసుకుందాం రండి

Big Stories

Advertisement
×