Gundeninda GudiGantalu Today episode October 14th : మీనా బాలు వాళ్ళిద్దరిని చూసి ఎక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఫ్రాడ్ చేయాలనుకుంటున్నారా అని అనుకుంటారు. అయితే వాళ్ళిద్దరూ కూడా మీనా బాలుని చూడకుండా డబ్బుల కోసం అని లోపలికి సంతోషంగా వస్తారు. ఇక మీనా వెళ్లి తలుపు వేయగానే అక్కడున్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు విల్లా విజయ్. చాపల కొట్టులో చాపలు వదిలేసి వెళ్లిపోయావు.. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా మళ్లీ ఇలా మోసం చేయడానికి వచ్చేసావు అంటూ మీనా దుమ్ము దులిపేస్తుంది ఇక బాలు మీనాకు తోడుగా మురళి విద్య కూడా ఉండడంతో వాళ్లని చెడుగుడు ఆడుకుంటారు. ఇక మనోజ్ రోహిణి లు కూడా వచ్చి వాళ్ళని కొట్టడంతో పోలీసులు ఇంకా కొడితే వాళ్ళని చంపేసినట్లు అవుతుంది అని ఆపుతారు..
పోలీసులకు బాలు ఫోన్ చేసి చెప్పగానే అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. అసలు పోలీసులకి మీరెందుకు చెప్పారు మేమే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టే వాళ్ళం కదా ఎందుకు పోలీసులు వినిపించారు అని అనగానే ఒక్కసారిగా బాలు మీనా షాక్ అవుతారు. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడకండి ఏం మాట్లాడుతున్నారు అని రోహిణి తో మీనా బాధనికి దిగుతుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళగానే రోహిణి అన్న మాటలు విని మీనా దిమ్మ తిరిగిపోయేలా క్లాసు ఇస్తుంది. అటు శృతి కూడా మాటకు మాట సమాధానం చెబుతూ రోహిణి అవమానించేలా మాట్లాడుతుంది. ఎంతో ఇద్దరు కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు మన డబ్బులు మనకు రాకుండా చేయడానికి వీలు ఇలా చేస్తున్నారు అని అంటారు..
మనోజ్ బాలు దెబ్బకి నాకు రోజు రోజుకి టెన్షన్లు పెరిగిపోతున్నాయి. నాకు నోటి దగ్గర ఎప్పుడూ ఏదో ఒకటి చేసే కొడుకునే ఉంటారు. ఇప్పుడు ఆ డబ్బులు వచ్చినా ఏంటి నేను షాప్ ని బాగు చేయించుకునే వాడిని అని మనోజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. బాలు మీనా ఎప్పుడు ఏదో ఒకటి చేసి మనకు ఏదో ఒక సమస్యలు తెస్తూనే ఉంటారు. అని రోహిణి కూడా అంటూనే ఉంటుంది. అయితే నాకు ఎటు డబ్బులు వచ్చే పనులు లేవు.. క్రెడిట్ కార్డు బిల్లులు.. అదేవిధంగా ఎటు చూసినా అప్పులే కనిపిస్తున్నాయి. కాబట్టి నాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చే వాళ్ళు లేరు అని రోహిణి తింటూ మనోజ్ చూడగానే రోహిణి నన్ను చూసి అంటున్నావ్ ఏంటి నావల్ల నువ్వు చాలా ఫీల్ అవుతున్నావా ఏంటి..? అని అంటుంది అప్పుడే ప్రభావతి సడన్గా ఎంట్రీ ఇచ్చి.. నా కొడుకు నిన్ను చేసుకోకుండా ఉంటే కోటీశ్వరుడు అయ్యేవాడు అని ప్రభావతి రోహిణి తిట్టేసి వెళ్ళిపోతుంది.
మనము మంచి చేయాలని చూసినా కూడా మనకే చెడు ఎదురవుతుంది అంటే ఇదేనేమో అని బాలు మీనా చాలా ఫీల్ అవుతూ ఉంటారు.. మనం ఎంతగా ఒకరికి సాయం చేయాలని చూసినా కూడా మనకు ఏదో ఒకటి ఇలా జరుగుతూనే ఉంటుంది అందుకే ఎవరికి మంచి చేయకూడదు అని నాకు అర్థం అయిపోయిందని మీనా అంటుంది. మనోజ్ కి డబ్బులు వస్తే మనకు కూడా మంచిదే కదా అది వాళ్ళ ఆలోచించరు మనమేదో కావాలనే చేసాము అని మన మీద అంటూ ఉంటారు పోనీలే అసలు రోహిణి కూడా అలానే అనడం నాకు చాలా బాధగా ఉంది అని మీనా అంటుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు మీనా ఎవరి గురించి మనము ఆలోచించకూడదు అని బాలు అంటాడు. ఇకపోతే బాలు మాట విన్న మీనా కూడా మౌనంగా ఉండిపోతుంది. పువ్వులు కొనడానికి పొద్దున్నే వెళ్దాము అని ఇద్దరు కలిసి పడుకుంటారు.
రోహిణి స్కూల్ కి వస్తుందో రాదు అని చింటూ బాధపడిపోతూ ఉంటాడు. అయితే అమ్మ రాదా ఎందుకు రాదు నేనంటే ఇష్టం లేదా అని చింటూ సుగుణమని అడగగానే.. తనని నేను కానీ తప్పు చేశాను రా తను నిన్ను కానీ తప్పు చేసింది అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ఆటోలో ఎక్కగానే చింటూ కనీసం అమ్మకి ఫోన్ అయినా చేస్తాను అని అంటాడు అయితే అప్పుడే ఆటో రిపేర్ కి వస్తుంది.. చింటూ ద్రోహిని కి ఫోన్ చేసి స్కూల్లో కాంపిటేషన్ జరుగుతుందమ్మా అందుకే నేను ఈ గెటప్ వేసుకున్నాను అని చెప్పగానే రోహిణి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే సడన్గా బాలు మీనా కూడా అక్కడకి రావడంతో సుగుణమ్మ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఇక బాలు మీనా రాగానే చింటూ రోహిణి వాళ్ళకి అలా చూపించగానే రోహిణి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్తుంది ఇక బాలు కి కూడా చింటూ అబద్ధం చెప్పేస్తాడు.
గుణ మీనా ఫ్రెండ్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండగా మీనా అక్కడికి సడన్గా ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన గుణ నా పనికి మీరు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటారా..? ఇది నా పని నా ఇష్టం మీరెందుకు మధ్యలో కలగజేసుకుంటున్నారు అని అంటాడు. అయితే బాలుని ఎలాగైనా సరే ఈ భూమ్మీద నుంచి లేకుండా చేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందని గుణ అనుకుంటాడు. అయితే రోహిణి కి ఫోన్ చేసి బాలు కారు కీస్ కావాలని అడుగుతాడు కానీ రోహిణి మాత్రం నేను ఏమీ చేయలేను అని చెప్తుంది అప్పుడే దినేష్ ని రంగంలోకి దించుతాడు. గుణ మాట ప్రకారమే దినేష్ రోహిణి కి కాల్ చేసి మాట్లాడడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..