IAS officers: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలో పలు జిల్లాలో ప్రస్తుతం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్సీలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు..
అడిషన్ ఎస్సీగా పదోన్నతులు కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే స్థానంలో కొనసాగాలని తెలిపింది. వేములవాడలో ఏఎస్పీగా పనిచేస్తున్నశేషాద్రిని రెడ్డిని అదే స్థానంలో అడిషనల్ ఎస్పీగా, బైంసాలో ఉన్న అవినాష్ కుమార్ ను, ఏటూరునాగారంలో ఏఎస్పీగా పనిచేస్తున్న శివం ఉపాధ్యాయను, భువనగిరిలో ఉన్న కంకణాల రాహుల్ రెడ్డిని, ఉట్నూర్ లో ఏఎస్పీగా పనిచేస్తున్నకాజల్ సింగ్‌కు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ALSO READ: Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్
రెండు రోజుల క్రితం కూడా…?
రెండు రోజుల క్రితం కూడా తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఐదుగురు అధికారులకు పోస్టింగ్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీస్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
ALSO READ: Hyderabad ECIL: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మంచి వేతనం