Child Labour Vaibhav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi) పేరు మాత్రం మారుమోగుతోంది. ప్రతి మ్యాచ్ లోనూ ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడుతున్నాడు వైభవ్. 300ల స్ట్రైక్ రేట్ తో ఇరగదీస్తున్నాడు. బుమ్రా నుంచి మొదలుకొని భువనేశ్వర్ కుమార్ వరకు అందరి బౌలింగ్ లోనూ చితక్కొడుతున్నాడు. అయితే తాజాగా వైభవ్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వివాదంలో చిక్కుకుంది. అతన్ని వాటర్ బాయ్ గా ( Vaibhav water boy) వాడుకుంది రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals). దీంతో బాల కార్మిక చట్టం ప్రకారం రాజస్థాన్ రాయల్స్ పైన రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. 15 ఏళ్ల కుర్రాడితో ( Child Labour Vaibhav) వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ మోపిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా క్రికెట్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాజస్థాన్ రాయల్స్ జట్టుపై బ్యాన్ విధించాలని కోరుతున్నారు.
Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్కడ స్టేడియాలపైనే బాంబులు పడతాయి
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండు రోజుల కిందట హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ డకౌట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా ఓడిపోయింది. అయితే ఇదే మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీని వాటర్ బాయ్ గా వాడుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్. దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల కుర్రాడిని వాటర్ బాయ్ గా ఎలా వాడతారని ఫైర్ అవుతున్నారు. వెంటనే రాజస్థాన్ రాయల్స్ పై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని కోరుతున్నారు. అలాగే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ను తెలంగాణ డిఎస్పి మహమ్మద్ సిరాజ్ అరెస్టు చేయాలని కూడా సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
భారతీయ లేబర్ చట్టాల ప్రకారం 14 సంవత్సరాల లోపు ఎవరైనా పిల్లలు, కార్మికుల తరహాలో పనులు చేస్తే నేరంగా భావిస్తారు. పాఠశాల నుంచి మొదలుకొని ఏ రంగమైన సరే, 14 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలతో చాకిరీ చేయించుకోకూడదు. అయితే వాటర్ బాయ్ అవతారం ఎత్తిన వైభవ్ సూర్యవంశీ వయస్సు ప్రస్తుతం 15 సంవత్సరాలు. భారత చట్టాల ప్రకారం ఇది లేబర్ యాక్ట్ కింద రాబోదని చెబుతున్నారు. ఈ మేరకు కొంతమంది సామాజికవేత్తలు పోస్టులు కూడా పెడుతున్నారు.
Also Read: Ahmed Shehzad: PSLలో వార్నర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయర్లు తప్ప, ఎవడూ మిగలలేదు
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==