Smriti Mandhana Vs Harmanpreet Kaur Cold War: టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ పదవికి రాజీనామా స్టేట్మెంట్ ఇచ్చారు. కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్… ప్లేయర్ గా టీమిండియాలో కొనసాగుతానని ప్రకటించారు. మరికొన్ని రోజులు క్రికెట్ లో కొనసాగి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నఫలంగా రాజీనామా చేయడం వెనుక పెద్ద కుట్ర జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ ( Smriti Mandhana Vs Harmanpreet Kaur Cold War) మధ్య సంబంధాలు ఏ మాత్రం బాగా లేవని నివేదికలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా విపరీతంగా పెరిగాయని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న బీసీసీఐ… హర్మన్‌ప్రీత్ కౌర్ తో బలవంతంగా రాజీనామా చేయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, కొత్త సారధి స్మృతి మంధాన మధ్య నిత్యం గొడవలు జరిగేవని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి మ్యాచ్ లో తానే అద్భుతంగా ఆడతానని స్మృతి మంధానకు కాస్త సెల్ఫిష్ బిహేవియర్ ఉండేదని చెబుతున్నారు. తాను పరుగులు చేస్తే టీమిండియా గెలుస్తుందని, దీనివల్ల హర్మన్‌ప్రీత్ కౌర్ కు కెప్టెన్ గా మంచి పేరు వస్తుందని నిత్యం డ్రెస్సింగ్ రూమ్ లో స్మృతి మందాన బహిరంగంగానే మాట్లాడేదని అంటున్నారు. అయితే దీనిపై హర్మన్‌ప్రీత్ కౌర్ తరచూ విభేదిస్తూ వచ్చేవారట.
అయితే ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ సందర్భంగా ఈ గొడవ, పెద్దదైందని సమాచారం. అంతేకాదు జపాన్ పర్యటన సందర్భంగా ఇద్దరు మధ్య పెద్ద గొడవే జరిగిందట. డ్రెస్సింగ్ రూమ్ లో తన్నుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం బీసీసీఐ దాకా వెళ్లిందని సమాచారం. దీంతో గౌహతి వేదికగా సీరియస్ సమావేశం నిర్వహించిన బీసీసీఐ…హర్మన్‌ప్రీత్ కౌర్ తో బలవంతంగా రాజీనామా చేయించారట. ఆ తర్వాత వెంటనే స్మృతి మంధానకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించేశారు. వన్డేల్లోనైనా కెప్టెన్ గా కొనసాగుతానని హర్మన్‌ప్రీత్ కౌర్ కోరినా, బీసీసీఐ పెద్దలు పట్టించుకోలేదట. 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే, యంగ్ స్మృతి మంధానే తమకు ప్రాధాన్యం అనే సంకేతాలు ఇచ్చి, కెప్టెన్సీ నుంచి వైదొలిగేలా బీసీసీఐ చేసిందని అంటున్నారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలీదు కానీ, జోరుగా ప్రచారం సాగుతోంది.