IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇప్పటికే దాదాపు 40 మ్యాచ్ లు పూర్తయిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఇంటికి వెళ్లే జట్లు ఏవి ? ప్లే ఆప్స్ వెళ్లే జట్లు ఏవి? అనే విషయాలు చాలా క్లారిటీగా అర్థమవుతున్నాయి. క్రికెట్ అభిమానులు కూడా ఓ అంచనాకు వచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి కెప్టెన్ ఉన్నప్పటికీ.. ఆ జట్టు అసలు పుంజుకోవడమే గగనమైంది.
చెన్నై నుంచి ఇతర జట్లకు తరలిపోతున్న అభిమానులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరిస్థితులను అర్థం చేసుకున్న ఆ జట్టు అభిమానులు… వేరే జట్లకు వెళ్ళిపోతున్నారు. ఇతర జట్లకు… సపోర్ట్ చేస్తూ… చెన్నై ని మర్చిపోయా ప్రయత్నం చేస్తున్నారు అభిమానులు. మహేంద్రసింగ్ ధోని… వచ్చే సీజన్ ఆడే ఛాన్సే లేదు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ప్లే ఆప్స్ కు వెళ్లే.. పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అభిమానులు కూడా ఒక్కొక్కరుగా.. తమ ఫేవరెట్ జట్టు చెన్నై ని మర్చిపోయి ఇతర జట్లకు ట్రాన్స్ ఫర్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య.. తాజాగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో చెన్నై అభిమానులు మొత్తం… ఈ మ్యాచ్ కు వెళ్లారు. లక్నోలో మ్యాచ్ జరిగినప్పటికీ.. చెన్నై జెర్సీలు వేసుకొని ఈ మ్యాచ్ తిలకించారు.
వాస్తవానికి ఢిల్లీ అలాగే లక్నో సూపర్ జెంట్స్ జట్టలో పెద్ద స్టార్ క్రికెటర్లు ఎవరూ లేరు. కేఎల్ రాహుల్ మాత్రం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అటు లక్నో కెప్టెన్గా పంతు ఉన్నాడు. అలాంటి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అటువైపుగా తరలిపోతున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… మరింత టెన్షన్ పడుతోంది. మరి ఈ పరిస్థితిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా దాటుతుందో చూడాలి.
పాయింట్ల పట్టికలో చివరన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో పాయింట్లు పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిట్ట చివరన ఉంది. మొత్తం ఎనిమిది మ్యాచ్లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించింది. ఆరు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. కాబట్టి ఇకపైన జరిగే ప్రతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందే.