E-Paper
Advertisement

ఏషియన్ గేమ్స్ ఫైనల్స్‌లో దిక్కుమాలిన రూల్స్…వర్షం పడితే టీమిండియా పని గోవిందా ?

ఏషియన్ గేమ్స్ ఫైనల్స్‌లో దిక్కుమాలిన రూల్స్…వర్షం పడితే టీమిండియా పని గోవిందా ?
Advertisement

Asian Games 2026 Ind vs pak final:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్బంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్స్ జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో అక్టోబర్ 3వ తేదీన జరిగే ఫైనల్స్ వర్షం కారణంగా రద్దైతే, పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. క్వార్టర్ ఫైనల్స్ సందర్భంగా టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ వర్సెస్ హంకాంగ్ మ్యాచ్ లు రద్దు అయ్యాయి. ఈ క్రమంలో ర్యాంకింగ్స్ ప్రకారం, టీమిండియా, పాక్ లను సెమీస్ పంపారు. వర్షం కారణంగా ఫైనల్స్ రద్దు అయితే మాత్రం, ర్యాంకింగ్స్ పనికిరావని అంటున్నారు. మ్యాచ్ రద్దైతే, రెండు జట్టు గోల్డ్ మెడల్ పంచుకోవాల్సి ఉంటుందని ఏషియన్ గేమ్స్ రూల్స్ చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన పాకిస్తాన్, టీమిండియా ఫైనల్స్ కు చేరి.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, రెండు జట్లు గోల్డ్ మెడల్ పంచుకోవాలన్న మాట. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడకుండా యథావిధిగా మ్యాచ్ జరగాలని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రం వర్షం పడాలని అల్లాకు ప్రార్థనలు చేయడం మొదలు పెట్టేశారు. సెమీస్ కాకముందే, ఏషియన్ గేమ్స్ రూల్స్ పై రచ్చ మొదలైంది.

వర్షం పడాల్సిందే…లేకపోతే పాకిస్తాన్ ఓడిపోవడం పక్కా

ఏషియన్ గేమ్స్ ఫైనల్స్‌లో టీమిండియా, పాకిస్తాన్ (Asian Games 2026 Ind vs pak final) మధ్య కచ్చితంగా ఫైట్ జరుగుతుందని బాసిత్ అలీ అంచనా వేశారు. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియాను ఓడించే సత్తా పాకిస్తాన్ కు లేదని పరువు తీశారు. అనవసరంగా మ్యాచ్ జరిగితే, పాకిస్తాన్ ఇజ్జత్ మొత్తం పోతుందని బాంబ్ పేల్చారు. అల్లా దయతో వర్షం పడి ఫైనల్స్ రద్దు కావాలని కోరారు. అలా జరిగితే, గోల్డ్ మెడల్ ను ఇండియా, పాకిస్తాన్ పంచుకోవచ్చని తెలిపారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

సెమీస్ ఫైట్ ఎవరి మధ్య అంటే ?

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్స్ కు మొత్తం నాలుగు జట్లు దూసుకొచ్చాయి. తొలి సెమీస్ లో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. రెండో సెమీస్ శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య ఫైట్ ఉంటుంది. ఈ రెండు సెమీస్ లలో టీమిండియా, పాకిస్తాన్ గెలుస్తాయని అంచనా వేస్తున్నారు. మరి సెమీస్ ఎవరు గెలిచి, ఫైనల్ కు చేరుతారో చూడాల్సి ఉంది. కానీ సెమీస్ జరగకముందే, టీమిండియా, పాకిస్తాన్ మాజీల మధ్య మాటల యుద్ధం షురూ అయింది.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Related News

రియాలిటీ షో చేయాలంటూ రూ.12 కోట్ల ఆఫర్..ఛీ కొట్టిన విరాట్ కోహ్లీ ?

విరాట్ కోహ్లీ బ్యాటింగ్, రికార్డులు చూసి..సచిన్ కుళ్లుకుంటున్నాడు!

మొహ్సిన్ నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే ప్లాన్

నీకు టీమిండియా కంటే పెళ్లాం ఎక్కువైందా ? కోహ్లీపై దారుణంగా ట్రోల్స్ !

ముంబై ఇండియ‌న్స్ ఒక్క మ్యాచ్ గెల‌వొద్దు…స‌ర్వ నాశ‌నం కావాలి

అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డొద్దు…టీమిండియాను ఓడించ‌డం చాలా ఈజీనే

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Big Stories

Advertisement
×