Virat Kohli Rejects Reality Show Offer: టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్ లో అదరగొడుతున్న కింగ్ విరాట్ కోహ్లీ గురించి ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ఓ రియాలిటీ షో చేస్తే, ఒక్కో ఎపిసోడ్ కు రూ.12 కోట్లు ఇస్తామని విరాట్ కోహ్లీకి ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఆఫర్ ను విరాట్ కోహ్లీ ఎలాంటి ఆలోచన లేకుండా రిజెక్ట్ చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. రోహిత్ శర్మ తరహాలో తాను రియాలిటీ షో చేయలేనని విరాట్ కోహ్లీ కుండ బద్దలు కొట్టినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రస్తుతం 2027 వన్డే వరల్డ్ కప్ పైన ఫోకస్ చేసినట్టు చెప్పారట. ఎలాంటి షోలు చేసే ఉద్దేశ్యం తనకు లేదని వెల్లడించారట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలీదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం రూ.12 కోట్ల ఆఫర్ ను 2027 వన్డే వరల్డ్ కప్ కోసం వదిలేసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు.
విరాట్ కోహ్లీకి రియాలిటీ షో నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నివేదికలు చెబుతున్నాయి. అదంతా ఫేక్ అంటున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్టుకే విరాట్ కోహ్లీ రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. అలాంటిది ఒక్క రియాలిటీ షో ఎపిసోడ్ కు విరాట్ కోహ్లీ ఎన్ని కోట్లు తీసుకోవాలో ? అర్థం చేసుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే, ఒక్క ఎపిసోడ్ కు రూ.12 కోట్లు అనేది ఫేక్ అంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ పోస్టుల గురించి చెప్పబోయి.. ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అలాగే రోహిత్ శర్మ చేసే రియాలిటీ షోపై విరాట్ కోహ్లీ ఎలాంటి కామెంట్స్ చేయలేదట. ఈ ఇద్దరి మధ్య 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు గొడవలు పెట్టాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అటు విరాట్ కోహ్లీపై వస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అతని టీమ్ కూడా ప్రకటించిందని తెలుస్తోంది.
2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా రోహిత్, కోహ్లీ దూకుడుగా కనిపిస్తున్నారు. ఫిట్ నెస్ కూడా మెంటేన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు జరిగే వన్డేల్లో రాణించి, వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఇరగదీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వరల్డ్ కప్ ఫినిష్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.