E-Paper
Advertisement

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?
Advertisement

Nake Cave| ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలున్నాయి. వాటిలో ఒకటి నాకా గుహ. ఒక భారీ పాము నేలపై పడుకుని రాయిగా మారిపోయిందా? థాయ్‌లాండ్‌లోని నాకా గుహను చూస్తే ఇలాంటి సందేహం కలగడం సహజం. ఈ గుహలోని భారీ రాతి నిర్మాణాలు పాము శరీరాన్ని పోలి కనిపిస్తాయి. రాళ్లపై ఉన్న నమూనాలు పాము పొలుసులను గుర్తుకు తెస్తాయి. అందుకే ఈ ప్రాంతానికి పురాతన నాగు పాముల కథ కూడా ముడిపడి ఉంది.

నాకా గుహ ఈశాన్య థాయ్‌లాండ్‌లోని ఫు లంకా నేషనల్ పార్క్‌లో ఉంది. ప్రకృతి అందాలతో పాటు స్థానిక పురాణాలు కూడా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మార్చాయి. ముఖ్యంగా నాకా ఐ అనే రాతి నిర్మాణం సందర్శకులను ఆకట్టుకుంటుంది.

నాకా గుహ వెనుక నాగరాజు కథ

Advertisement

స్థానిక పురాణాల ప్రకారం.. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ప్రాంత రాజకుమారుడు ‘ఫా హంగ్’ పాతాళలోకం నీటి అడుగున ఉన్న నాగ రాజ్యానికి చెందిన యువరాణిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు నఖరింత్రాణి అని చెబుతారు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం.. ఆమె తన పాము రూపాన్ని దాచుకుని మానవురాలిగా జీవించింది. ఆమె అనారోగ్యానికి గురైన సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో మనుషులు, నాగుల మధ్య పెద్ద వివాదం ఏర్పడింది. ఈ గొడవకు ఒక రాజ కిరీటం కూడా కారణమైందని స్థానిక కథనం ప్రచారంలో ఉంది. తర్వాత నాగరాజు కోపంతో రట్టాఫనాఖోన్ నగరాన్ని వరదలో ముంచేశాడని నమ్మకం ఉంది. అందుకే ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ‘బుయెంగ్ ఖోంగ్ లాంగ్’ సరస్సుతో అనుసంధానిస్తారు. ఫా హంగ్ తాత అయిన మహారాజు ‘ఉయే ల్యూ’కు నాగరాజు శపించాడు. ఈ శాపంతోనే అతను భారీ రాతి పాముగా మారాడని స్థానికులు నమ్ముతారు.

గుహలోని రాళ్లు పాము పొలుసుల్లా ఎందుకు కనిపిస్తాయి?

నాకా గుహలోని భారీ ఇసుకరాయి నిర్మాణాలు వంపులు తిరుగుతూ కనిపిస్తాయి. వాటి ఉపరితలంపై ఉన్న నమూనాలు పాము పొలుసులను పోలి ఉంటాయి. కొన్ని కోణాల్లో ఈ రాళ్లు నిజంగానే భారీ పాము శరీరంలా కనిపిస్తాయి. ‘నాకా ఐ’ అనే వృత్తాకార రాతి నిర్మాణం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అది పెద్ద పాము కన్నులా కనిపించడం ఈ పురాణానికి మరింత బలం ఇస్తుంది.

Advertisement

Also Read: గోవా కంటే బెటర్.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ 4 ప్రదేశాలు బెస్ట్

ఈ వింత రాతి ఆకృతులకు సైంటిఫిక్ కారణం

పురాణం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, భూగర్భ శాస్త్రం దీనికి సహజమైన కారణాన్ని వివరిస్తుంది. ఈ ప్రాంతంలోని ఇసుకరాళ్లు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల రాళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. తర్వాత భారీ వర్షాలు, తేమ, నీటి ప్రవాహాలు రాళ్లను క్రమంగా మార్చాయి. కోట్ల సంవత్సరాలపాటు జరిగిన వాతావరణ ప్రభావం రాళ్ల ఉపరితలంపై ప్రత్యేక నమూనాలను సృష్టించింది. నీటి కోత వల్ల నాకా ఐ ఆకారం కూడా ఏర్పడిందని శాస్త్రవేత్తలు వివరిస్తారు.

Also Read: దెయ్యాల కథలు, రహస్య ప్రదేశాలు.. ఇండియాలో కొత్త ట్రావెల్ ట్రెండ్

పురాణం, ప్రకృతి కలిసిన అద్భుత ప్రదేశం

నాకా గుహలో పురాణం, ప్రకృతి, భూగర్భ శాస్త్రం ఒకే చోట కనిపిస్తాయి. కొందరికి ఇది రాతిగా మారిన పురాతన నాగరాజుల కథలా అనిపిస్తుంది. మరికొందరు దీనిని కోట్ల సంవత్సరాల ప్రకృతి శక్తికి నిదర్శనంగా చూస్తారు. నమ్మకం ఏదైనా, నాకా గుహ సందర్శకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. రాతి పాము ఆకృతులు, నాగుల పురాణాలు ఈ ప్రదేశాన్ని థాయ్‌లాండ్‌లోని ఆసక్తికరమైన సహజ ప్రదేశాల్లో ఒకటిగా మార్చాయి.

Related News

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

బస్ డిపోకు వెళ్లాల్సిన పనిలేదు.. మీ కాలనీ నుంచే దసరా స్పెషల్ బస్సులు!

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

Big Stories

Advertisement
×