E-Paper
Advertisement

ఐపీఎల్ లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ వేశాడు..ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాడు !

ఐపీఎల్ లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ వేశాడు..ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాడు !
Advertisement

Kamran Khan – Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League tournament) ద్వారా చాలా మంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది ఇప్పటికీ కూడా అద్భుతంగా రాణిస్తూ టీమ్ ఇండియాలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరి కొంత మంది ఒకటి రెండు సీజన్లలో మెరిసి… ఆ తర్వాత కనుమరుగైపోతున్నారు. అలాంటి వారిలో కమ్రాన్ ఖాన్ (Kamran Khan) ఒకరు. ఒకప్పుడు ఐపీఎల్ లో తొలి సూపర్ ఓవర్ వేసి.. చరిత్ర సృష్టించాడు. మలింగా తరహాలో బౌలింగ్ చేసి… ప్రత్యర్ధులకు చుక్క‌లు చూపించేశాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన కమ్రాన్ ఖాన్, ఇప్పుడు ద‌య‌నీయమైన ప‌రిస్థితుల్లో ఉన్నాడు. వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. ఈ త‌రుణంలోనే తాజాగా క‌మ్రాన్ ఖాన్ వీడియో వైర‌ల్ గా మారింది.

ఐపీఎల్ లో సూప‌ర్ ఓవ‌ర్ వేశాడు..ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాడు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన కొత్తలోనే కమ్రాన్ ఖాన్ పాపులారిటీ దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి రాత్రికి రాత్రే స్టార్ క్రికెటర్ గా మారాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా షేన్‌ వార్న్ ఉన్న సమయంలో కమ్రాన్ ఖాన్ కు వరుసగా అవకాశాలు దక్కాయి. ప్రతి బంతి 140కి పైగా స్పీడ్ తో వేసేవాడు. ఈ క్రమంలోనే అత‌న్ని టోర్నడో అని పిలిచేవారు. ఐపీఎల్ చరిత్రలో మొట్ట మొదటి సూపర్ ఓవర్ వేసిన బౌలర్ గా కూడా కమ్రాన్ ఖాన్ రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ సందర్భంగా కమ్రాన్ ఖాన్ సూపర్ ఓవర్ వేయడం జరిగింది. అద్భుతమైన బౌలింగ్ చేసి ఆ రోజున మ్యాచ్ కూడా గెలిపించాడు. దీంతో కమ్రాన్ ఖాన్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.

Advertisement

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

కమ్రాన్ ఖాన్ బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు

శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా తరహాలోనే కమ్రాన్ ఖాన్ బౌలింగ్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతని బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు కూడా వచ్చాయి. త్రో-బౌలింగ్ చేస్తున్నాడని.. క్రికెట్ కు అతడి బౌలింగ్ పనికి రాదని కొంతమంది విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే అతని కెరీర్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత 2011లో పూణే వారియర్స్ ఇండియా జట్టు తరఫున రీ-ఎంట్రీ ఇచ్చాడు. అయినప్పటికీ అతడి బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు రావడంతో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు.

ఇంతకు ఎవరీ కమ్రాన్ ఖాన్ ?

Advertisement

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అంజాఘాట్ ప్రాంతానికి చెందిన కట్టల వ్యాపారి కుమారుడే ఈ కమ్రాన్ ఖాన్. తీవ్రమైన పేదరికం నుంచి అతడు వచ్చాడు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడి ఐపీఎల్ కు సెలెక్ట్ అయ్యాడు. అయితే ఇతని ప్రతిభ గుర్తించి రాజస్థాన్ రాయల్స్ లోకి షేన్ వార్న్ ను తీసుకున్నాడు. అలాంటి కమ్రాన్ ఖాన్ ఇప్పుడు తన సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

 

 

Related News

ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ఆడి, ఇంగ్లండ్ లో పాకిస్తాన్ ప‌ళ్లు రాల‌గొట్టుకుంది

పార్టీలు, అమ్మాయిలకు అభిషేక్ శర్మ బానిస అయ్యాడు..యోగ్‌రాజ్ సింగ్ సీరియ‌స్‌

ఐపీఎల్ డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, కెరీర్ నాశ‌నం చేసుకోవ‌ద్దు..పుజారా హెచ్చ‌రిక‌

తొలి టెస్ట్ లో పాకిస్తాన్ అంపైర్…శత్రువైనా టీమిండియాను గెలిపించాడంటూ ఆరోప‌ణ‌లు!

షాహిద్ అఫ్రిదిని కుక్క అంటూ బండ బూతులు తిట్టాను…ఇర్ఫాన్ ప‌ఠాన్ సంచ‌ల‌నం

టీమిండియా క్రికెట‌ర్లు పీక‌ల‌దాకా తాగి, నాకు ఉపాధి లేకుండా చేశారు!

టీమిండియా విజ‌యం ఐసీసీ కుట్ర‌..స్పిన్ ట్రాక్ పెట్టి, లంక‌ను ఓడించారు!

Big Stories

Advertisement
×