Eng vs Ind, 3rd Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు టెస్టుల నేపథ్యంలో.. ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాల్టి నుంచి మూడవ టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూడవ టెస్టు లండన్ లోని లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రెండు జట్లు కూడా లండన్ లోని లార్డ్స్ చేరుకున్నాయి. గెలుపే లక్ష్యంగా రెండు జట్లు కూడా నిన్నటి వరకు ప్రాక్టీస్ కూడా చేశాయి.
Also Read: Shubman Gill – Sara: లండన్ పార్టీలో గిల్ కు అవమానం… సారాతో క్లోజ్ గా యువరాజ్ !
మూడో టెస్ట్ మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ ప్రారంభం కాబోతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. టాస్ ప్రక్రియ మూడు గంటలకు ఉంటే మ్యాచ్ మాత్రం మూడున్నర గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మూడవ టెస్ట్ ను జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లలో చూడవచ్చు. దూరదర్శన్ లో కూడా టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లు వస్తున్నాయి. దూరదర్శన్ లో ఉచితంగానే ఎలాంటి రూపాయి చెల్లించకుండా మ్యాచులు చూడవచ్చు.
భారీ మార్పులతో టీమిండియా
రెండు టెస్టులు అద్భుతంగా విజయం సాధించిన టీమిండియా… జట్టులో కీలక మార్పులు చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. బుమ్రా మరోసారి జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. ప్రసిద్ధ కృష్ణను పక్కకు పెట్టే ఛాన్సులు వందకు వంద ఉన్నాయి. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ని కూడా పక్కకు పెట్టి.. అర్ష్ దీప్ సింగ్ ను బరిలోకి దించే ఛాన్స్ ఉంది. అంటే మొత్తం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో.. టీమిండియా లార్డ్స్ టెస్ట్ ఆడబోతుందని తెలుస్తోంది. జలేజా ఆల్ రౌండర్ గా కొనసాగన్నాడు. మిగిలిన ప్లేయర్ లందరూ బ్యాటర్లు కావడం విశేషం.
లార్డ్స్ రికార్డులు
లార్డ్స్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు 19 మ్యాచులు జరిగాయి. ఇందులో టీమిండియా కంటే ఇంగ్లాండ్ ఎక్కువ గెలిచింది. ఈ 19 మ్యాచ్లలో ఇంగ్లాండ్ 12 గెలవగా… టీమిండియా 3 గెలిచింది. మరో 4 మ్యాచ్లు డ్రా అయ్యాయి.
ఇంగ్లండ్ వర్సెస్ భారత్ 3వ టెస్టు టీమ్స్:
భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (C ), జామీ స్మిత్ (WK), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్సే, క్రిస్ వోక్స్