BigTV English
Advertisement

Bhagyashree: సీనియర్ నటికి గాయాలు, 13 కుట్లు.. ఇంతకీ ఏం జరిగిందంటే.?

Bhagyashree: సీనియర్ నటికి గాయాలు, 13 కుట్లు.. ఇంతకీ ఏం జరిగిందంటే.?

Bhagyashree: సీనియర్ నటి భాగ్యశ్రీ తాజాగా హాస్పిటల్‌లో బెడ్ మీద పడుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు తనకు ఏం జరిగిందని ఫ్యాన్స్ ఆందోళన పడడం మొదలుపెట్టారు. అసలు ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకే ఫ్యాన్స్‌కు రిలీఫ్ అందించడం కోసం నవ్వుతూ ఒక ఫోటోను షేర్ చేసింది భాగ్యశ్రీ. అప్పుడు కూడా తన తలకు గాయం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు విషయం ఏంటనేది తర్వాత బయటపడింది. పికిల్ బాల్ ఆడుతున్న సమయంలో తలకు గాయం అవ్వడం వల్ల భాగ్యశ్రీకు పలు సర్జరీలు జరిగాయని, 13 కుట్లు కూడా పడ్డాయని తెలుస్తోంది.


గేమ్‌లో గాయం

ఫారిన్ దేశాల్లో ఎప్పటినుండో పాపులర్ స్పోర్ట్స్‌గా ఉన్న పికిల్ బాల్ (Pickleball).. తాజాగా ఇండియాలో కూడా అడుగుపెట్టింది. ముఖ్యంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ స్పోర్ట్స్‌ను ప్రమోట్ చేయడంతో వెంటనే దీనికి పాపులారిటీ లభించింది. అలా మరికొందరు సెలబ్రిటీలు కూడా పికిల్ బాల్ ఆడుతూ దీని గురించి ఇండియాలోని యూత్‌కు తెలిసేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా భాగ్యశ్రీ కూడా పికిల్ బాల్‌పై ఆసక్తితో గ్రౌండ్‌లో దిగారట. పికిల్ బాల్ ఆడుతున్న సమయంలో తన తలకు గాయం కావడంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలించారట. తలకు గాయం చాలా బలంగా తగలడంతో ఆసుపత్రికి చేరుకోగానే భాగ్యశ్రీకి సర్జరీ చేశారట వైద్యులు.


ఫోటోలు వైరల్

పికిల్ బాల్ వల్ల జరిగిన గాయానికి భాగ్యశ్రీకి సర్జరీ జరగడంతో పాటు 13 కుట్లు కూడా పడ్డాయి. హాస్పిటల్ స్టాఫ్ ద్వారా భాగ్యశ్రీ (Bhagyashree) బెడ్‌పై పడుకొని ఉన్న ఫోటో బయటికొచ్చింది. కాసేపట్లోనే అది వైరల్ అయ్యింది. తనకు ఏమైందో తెలియకపోయినా తను వెంటనే కోలుకోవాలని తన ఫ్యాన్స్ కోరుకున్నారు. ఒక ఫోటోలో తను హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండగా.. మరొక ఫోటోలో తనకు బ్యాండేజ్ ఉన్నా కూడా నవ్వుతూ కనిపించింది భాగ్యశ్రీ. దీంతో భాగ్యశ్రీ చాలా గట్టిదని, అంత గాయమయినా కూడా నవ్వుతూ ఉందని తన ఫ్యాన్స్ కాస్త రిలీఫ్ ఫీలవుతున్నారు. 13 కుట్లు పడడంతో తను పూర్తిగా కోలుకోవడానికి మరికాస్త సమయం పడుతుందని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

Also Read: అయిదేళ్లలో హయెస్ట్ టీఆర్పీ.. పవన్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’..

సినీ కెరీర్

1989లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. మొదటి సినిమానే సెన్సేషనల్ హిట్ కావడంతో భాగ్యశ్రీకి వెంటనే స్టార్‌డమ్ లభించింది. అలా కొన్నేళ్లలో పలు భారీ ప్రాజెక్ట్స్‌లో నటించింది. ఇక అప్పటి హీరోయిన్లలాగా భాగ్యశ్రీ కూడా పెళ్లి అవ్వగానే సినిమాలకు దూరమయ్యింది. చాలాకాలం తర్వాత 2021లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ‘తలైవి’తో మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’లో ప్రభాస్ తల్లిగా కనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా స్పీడ్‌గా వెళ్లకుండా నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌ను నడిపిస్తోంది భాగ్యశ్రీ.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×