E-Paper
Advertisement

కష్టకాలంలో కోహ్లీకి అండగా బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసింది

కష్టకాలంలో కోహ్లీకి అండగా బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసింది
Advertisement

Sohail Tanvir Supports Babar Azam:  పొద్దున లేస్తే చాలు.. విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం తోపు, తురుము, గ్రేట్ బ్యాటర్ అంటూ పాకిస్తాన్ మాజీలు తెగ పోస్టులు, కామెంట్స్ చేస్తూంటారు. అయితే, భజనకు మరో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ ( Sohail Tanvir) కూడా జత కట్టాడు. విరాట్ కోహ్లీకి బీసీసీఐ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ అండగా ఉందని, కానీ బాబర్ ఆజం వెనుక ఎవరూ లేరన్నారు. అయినప్పటికీ, బాబర్ ఆజం పడి లేచిన కెరటం లాగా ముందుకు సాగుతున్నాడని పేర్కొన్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు బాబర్ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడని, అయినా ఇప్పుడు మళ్లీ టెస్ట్ కెప్టెన్ గా ఎదిగాడని గుర్తు చేశారు.

కష్టకాలంలో కోహ్లీకి బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసింది

పాకిస్తాన్ జట్టు కష్టాల్లో పడితే బాబర్ ఆజం ఒక్కడే ఆదుకునేవాడని వివరించారు. కానీ విరాట్ కోహ్లీకి ధోని, గంభీర్, రోహిత్ శర్మ, సచిన్ లాంటి ఎంతో మంది క్రికెటర్లు సపోర్ట్ గా నిలిచినట్టు గుర్తు చేశారు. ఇలా అనేక రకాలుగా విరాట్ కోహ్లీకి సోర్సులు ఉన్నాయని, కానీ బాబర్ ఆజంను పాకిస్తాన్ జట్టులోని ప్లేయర్లే తొక్కేశారని ఆరోపణలు చేశారు. అందుకే కోహ్లీ కంటే, బాబర్ ఆజం బెస్ట్ అన్నారు. కష్టకాలంలో కోహ్లీకి బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ రోడ్డున పడేవాడని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో బాబర్ ఆజంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ ( Sohail Tanvir) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలు అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ ( Sohail Tanvir) కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టీమిండియా వాడుకోవాలని సూచనలు చేశారు. టీమిండియాలో ఇకపై ఆడే వన్డేలలో రోకో కాంబోకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని వెల్లడించారు.

Advertisement

దీని వల్ల 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరింత కాన్ఫిడెన్స్ తో ఆడతారన్నారు. కానీ అనవసరంగా లేనిపోనీ ప్రయోగాలు చేస్తే, మాత్రం టీమిండియా గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. వన్డే వరల్డ్ కప్ లో ఈ సారి టీమిండియా ఓడిస్తామని, ఆ దిశగా పాకిస్తాన్ క్రికెటర్లు సిద్ధం అవుతున్నట్టు చెప్పుకొచ్చారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

కుల్దీప్ యాదవ్ కంటే నేనే తోపు..కానీ, నన్నే తొక్కేశారు !

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ…తల పట్టుకుంటోన్న RCB యాజమాన్యం ?

స్మృతి మంధానతో గొడ‌వ‌లు…హర్మన్‌ప్రీత్ కౌర్ తో బ‌ల‌వంత‌పు రాజీనామా ?

వీడి బౌలింగ్ లో సిక్స్ కొడితే, నెక్స్ట్ బంతికే మటాషే…ప్ర‌త్య‌ర్థిని వ‌ణికిస్తోన్న నమన్ ధీర్

ఇది క‌దా స్కెచ్ అంటే…ఐసీసీ కొత్త రూల్స్ వాడుకుని విండీస్ ని దెబ్బ‌కొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

Big Stories

Advertisement
×