Captain Smith Machar: ప్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. గగనతలంలో ఎదురైన ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణికులను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యానికి యావత్ ప్రపంచం ఫిదా అయ్యింది. ఆయన అసమాన ధైర్యానికి గుర్తింపుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం జీవితకాల ఉచిత విమాన ప్రయాణ పాస్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు అపరిమితంగా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన జీవితాంతం ఎప్పుడైనా ఇజ్రాయెల్ కు ఉచితంగా వెళ్లవచ్చు.
సెప్టెంబర్ 30, 2026న కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఫ్లైదుబై విమానాన్ని నడుపుతూ టెల్ అవీవ్‌కు వెళ్తున్నారు. విమానం ప్రయాణంలో ఉండగా కాక్‌పిట్‌లో ఆయనపై తోటి లోకో పైలెట్ దాడి చేశాడు. ఈ ఘటనలో పైలట్ గాయపడినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. దాడిలో గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ డోర్ ను ఓపెన్ చేశాడు. విమానాన్ని నియంత్రించడంలో తన బాధ్యతను కొనసాగించాడు. ఆ సమయంలో ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 174 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు సేవ్ అయ్యాయి.
ఈ ఘటన తర్వాత కెప్టెన్ మచ్చార్‌కు ఇజ్రాయెల్ తరఫున జీవితకాల ఉచిత విమాన ప్రయాణ పాస్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు అపరిమితంగా ఉచిత విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించడం ఆయన ధైర్యానికి ఇచ్చిన ప్రత్యేక గౌరవంగా మీడియా కథనాలు వస్తున్నాయి.
కెప్టెన్ మచ్చార్‌కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా లభించినట్లు సమాచారం. భారతీయ ఆన్ లైన్ ట్రావెల్ సంస్థ ఈజ్‌మైట్రిప్.. కెప్టెన్ మచ్చార్‌తో పాటు ఆయన భార్య, పిల్లలకు ఐదేళ్ల పాటు భారత్ లో ఉచిత దేశీయ విమాన ప్రయాణాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఒక పైలట్ తన విధి నిర్వహణలో చూపిన ధైర్యానికి ప్రత్యేక గౌరవంగా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
విమానయాన రంగంలో పైలట్ బాధ్యత కేవలం విమానాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడం మాత్రమే కాదు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణికుల భద్రతను కాపాడటం కూడా వారి బాధ్యతలో కీలక భాగం. కెప్టెన్ స్మిత్ మచ్చార్ కూడా తన ప్రాణాలను పణంగా పెట్టి 174 మంది ప్రాణాలు కాపాడారు. ప్రపంచ వ్యాప్తంగా రియల్ హీరోగా కీర్తించబడుతున్నారు.
Read Also: లోకో పైలెట్ vs అసిస్టెంట్ లోకో పైలెట్.. ఇద్దరిలో అసలు రైలును నడిపేది ఎవరు?