Moin Khan On Virat Kohli Vs Sachin Tendulkar: టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో సూపర్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురుస్తుంటే, పాకిస్తాన్ మాజీ క్రికెట్ మొయిన్ ఖాన్ (Moin Khan) మాత్రం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ తన రికార్డులు ఎక్కడ బద్దలు కొడతాడోననే భయంతో సచిన్ వణికిపోతున్నాడని బాంబ్ పేల్చారు. అటు సచినే నా గురువు అంటూ విరాట్ కోహ్లీ గునపం దించుతున్నాడు ? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. వన్డే క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కంటే, అత్యంత ప్రమాదకరంగా విరాట్ కోహ్లీ మారిపోయాడంటూ వ్యాఖ్యానించారు. దీంతో విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ క్రికెట్ మొయిన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే, దీనిపై సచిన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఎంత మంది విరాట్ కోహ్లీలు వచ్చినా, ఎప్పుటికీ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వన్డేల్లో ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీనే అంటూ మొయిన్ ఖాన్ పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడన్నారు. అప్పట్లో సచిన్ కూడా అద్భుతంగా ఆడినట్టు గుర్తు చేశారు. ఆ సమయంలో సచిన్ ఆటను దగ్గరుండి చూసినట్టు వెల్లడించారు. కానీ అప్పటి సచిన్ కంటే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతీ మ్యాచ్ లోనూ చివరి వరకు బ్యాటింగ్ చేస్తూ, ఫినిష్ చేస్తున్నాడని తెలిపారు. వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడని, 40 ఏళ్ల వయస్సులో కూడా ఛేజ్ మాస్టర్ లా నిలిచినట్టు వెల్లడించారు. విరాట్ కోహ్లీని చూసి.. సచిన్ కూడా కుళ్లు కుంటున్నాడని బాంబ్ పేల్చారు.
సచిన్ టెండూల్కర్ తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 51 సెంచరీలు నమోదు చేసుకున్నాడు. వన్డేల్లో 49 సాధించాడు. మొత్తం 100 సెంచరీలు బాదేసి…క్రికెట్ గాడ్ గా నిలిచాడు సచిన్. అటు విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ లో కేవలం 29 సెంచరీలు మాత్రమే నమోదు చేసుకున్నాడు. వన్డేల్లో 55 సెంచరీలు చేసి.. సచిన్ రికార్డును ఎప్పుడో బ్రేక్ చేశాడు. టీ20లలో ఒకే ఒక సెంచరీ చేశాడు. ఇలా మొత్తంగా 86 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ముగిసేలోపు మరో 14 సెంచరీలు చేయాలని, సచిన్ రికార్డు బ్రేక్ చేయాలని కోహ్లీ ఫ్యాన్స్ కోరుతున్నారు. మరీ సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడా ? లేదా ? అనేది చూడాల్సి ఉంది.