Big Stories

Shubman Gill: ఇంపాక్ట్ ప్లేయర్ల వల్లే.. భారీ స్కోర్లు: గిల్

Shubman Gill: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పరాజయంపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు గుజరాత్ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గిల్ చెప్పాడు. అయితే తను మాట్లాడుతూ 4 పరుగుల తేడాతో ఓడిపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు. జట్టు మొత్తం బాగా ఆడిందని తెలిపాడు. మొదట్లోనే ఢిల్లీని నిలువరించాల్సిందని అభిప్రాయపడ్డాడు. కనీసం 210 వద్ద వారిని ఆపుచేసి ఉంటే, బాగుండేదని తెలిపాడు.

- Advertisement -

అలాగే మ్యాచ్ లో ఎక్స్‌ట్రాల రూపంలో చాలా ఇచ్చినట్టు తెలిపాడు. అవి ఆపినా విజయం సాధించేదని అన్నాడు. ఐపీఎల్‌లో ప్రతి జట్లు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో లబ్ధి పొందుతున్నాయని తెలిపాడు. నేను పోతే, మరొకడున్నాడనే భావనలో బ్యాటర్లు గుడ్డిగా ఆడుతున్నారని, ఒకొక్కసారి క్లిక్ అవుతున్నారని తెలిపాడు. అందుకనే 200 స్కోర్లు దాటి నమోదవుతున్నాయని తెలిపాడు.

- Advertisement -

అక్షర్ పటేల్, రిషబ్ పంత్ ఇద్దరిని ఆపలేకపోయామని అన్నాడు. వారిద్దరూ కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారని తెలిపాడు. వాళ్లెంత చేసినా, మా బ్యాటింగు తీరు చూశాక, ఏ దశలో కూడా ఓడిపోతామని అనుకోలేదని తెలిపాడు. ఏదేమైనా లోపాలను సరిచేసుకుని ముందుకు వెళ్లడమేనని తెలిపాడు.

శుభ్‌మన్ గిల్ అయితే మోహిత్ శర్మ గురించి అస్సలు ప్రస్తావించలేదు. కెప్టెన్ గా తన ఆటగాళ్లను కాపాడటం తన ధర్మంగా భావించాడు. అలాగైతే ఈ మ్యాచ్ లో తను 6 పరుగులే చేశాడు. ఓటమికి ఒకరకంగా తను కూడా బాధ్యుడే అని చెప్పాలి.

Also Read: Mohit new record IPL history: కలలో కూడా అవే.. ఐపీఎల్‌ హిస్టరీలో మోహిత్ రికార్డ్

ఇవేవీ కాకుండా ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా చెత్త రికార్డ్ ను మోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. నిజానికి తన ప్రదర్శన వల్ల కూడా గుజరాత్ ఓటమి పాలైంది. ఆ ఒక్క ఓవర్ లో తను 31 పరుగులిచ్చాడు. కనీసం 20 పరుగులిచ్చినా బాగుండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గుజరాత్ విజయానికి కేవలం 4 పరుగుల దూరంలో ఆగిపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News