E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఇందు      

Brahmamudi Serial Today Episode August 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఇందు      
Advertisement

Brahmamudi serial today Episode:  చలపతి చుట్టుపక్కల వాళ్లను పిలిచి రాజు గొప్పదనం గురించి రాజు చేస్తున్న జాబ్‌ గురించి చెప్పి నెల జీతం ఐదు లక్షలు అని గొప్పగా చెప్తూ ఎమోషనల్‌ అవుతుంటాడు. అంతా వింటున్న రాజు ఏడుస్తుంటాడు. మా నాన్న సంతోషపడతాడని తెలుసు కానీ మరీ ఇంత సంతోషపడతాడని తెలియదు ఇందు.. కొడుకు ఎదుగుదలలోనే తండ్రికి నిజమైన ఆనందం ఉంటుందని నాకిప్పుడు మా నాన్నను చూశాకే అర్థం అయింది. ఇందు మా నాన్న నోటి నుంచి ఎప్పుడూ ఒరేయ్‌ రాజుగా నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతావురా అనడం విన్నాను కానీ ఫస్ట్‌ టైం మా నాన్న ఇలా పది మందికి నా గురించి గొప్పగా చెప్తుంటే.. అంటూ రాజు ఎమోషనల్‌ అవుతూ.. అమ్మా, నాన్న నా గురించే చెప్తున్నారు అమ్మా… అంటూ ఇందుకు థాంక్స్‌ చెప్తూ.. ఇదంతా నీ వల్లే సాధ్యం అయింది అంటూ ఎమోషనల్‌ అవుతుంటాడు.

ఐశ్వర్య తన ఫ్రెండ్‌తో కాల్‌ మాట్లాడుతుంటే.. రేఖ వెళ్లి ఏం చేస్తున్నావు అని అడిగితే.. ఫ్రెండ్‌తో కాల్‌ మాట్లాడుతున్నాను.. అని చెబితే.. కాల్‌ మాట్లాడుతున్నావా..? అప్పు అడుగుతున్నావా..? అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే.. లేదు ఆంటీ..? అయినా ఆ నా పరిస్థితికి మీరే కారణం కదా..? మీరు ఆ ఇందుకు  పెత్తనం ఇచ్చారు. అదేమో రూపాయి కూడా ఇవ్వడం లేదు.. పైగా మహరాణిలా ఫీలవుతుంది అంటూ తిడుతుంది. దీంతో రేఖ అయితే ఆ ఇందును నేను ఏమీ అనలేను ఎందుకంటే.. దానికి ఆ పెత్తనం ఇచ్చింది నేనే కాబట్టి.. సో ఇప్పుడు ఇందును ఏమైనా చేయాలన్నా అది నువ్వే చేయాలి.. అని చెప్తుంటే..

Advertisement

ఐశ్వర్య ఆంటీ నువ్వేం చెప్పాలనుకున్నావో డైరెక్టుగా చెప్పొచ్చు కదా అనగానే.. రేఖ చూడు ఐషు నువ్వు వాళ్లను వీళ్లను అడుక్కోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే నువ్వు కూడా ఈ ఇంటి వారసురాలివే..? నీక్కూడా ఈ ఆస్థిలో హక్కు ఉంది. మరి అలాంటప్పుడు కంపెనీ లాభాల్లో నీక్కూడా వాటా వస్తుంది కదా..? మరి అలాంటప్పుడు నీకు ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా..? ఇవ్వలేదు కదా..? అందుకే ఇప్పుడు ఇందును నీ వాటా నువ్వు అడుగు అని చెప్తుంది. చాటు నుంచి అంతా వింటున్న భ్రమరాంబ చూశావా శేషు ఐషు ఈ ఇంటి వారసురాలు కాబట్టి వాటా అడగమని చెప్తుంది. మనం కాదు కాబట్టి మనకు చెప్పడం లేదు.. అంటే రేఖ కూడా మనల్ని పరాయివాళ్లను చేసింది అంటూ బాధపడుతుంది.

చలపతి ఇంట్లో అందరూ భోజనం చేస్తారు. భోజనం చేశాక చలపతి, ఇందును పొగుడుతాడు. రాజును ఎంతో మార్చాల్ని ప్రయత్నించాము కానీ ఇరవై ఏళ్లుగా మేము చేయలేని పని నువ్వు ఇప్పుడు చేశావు.. ఇప్పుడు వాడిని చూస్తుంటే.. మాకు గర్వంగా ఉంది. వాడు గొప్పగా బతకాలని మేము ఆశపడ్డాము.. కానీ నువ్వు వాడు గొప్పగా బతికేలా తీర్చిదిద్దావు అమ్మా అంటూ చలపతి ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇందు, లక్ష్మీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో రాజు ఇంట్లోంచి వచ్చి సుభాష్‌కు ట్రీట్‌మెంట్‌ చేయించడానికి డాక్టర్‌ ఆపాయింట్మెంట్‌ దొరికింది మనం వెళ్దాం పద అంటూ ఇందును తీసుకుని రాజు వెళ్లిపోతాడు.

Advertisement

రాజు, ఇందు, అపర్ణ ముగ్గురు కలిసి సుభాష్‌ను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ డాక్టర్‌, సుభాష్‌ను పరిశీలించి కొంచెం క్రిటికల్‌గా ఉన్నాడని.. అయితే ఆపరేషన్‌ చేస్తే నార్మల్‌ అవుతాడని చెప్తాడు. అయితే వెంటనే ఆపరేషన్‌ చేయమని ఇందు చెబితే.. అప్పుడే కాదని.. వారం పది రోజులు  మెడిసిన్స్‌ వాడాలని అప్పుడే ఆపరేషన్‌ చేయాలని చెప్తాడు. సరేనని మెడిసిన్స్‌ తీసుకుని ఇంటికి తిరిగి వస్తారు.

ఇంట్లోకి ఇందు, అపర్ణ, రాజు, సుభాష్‌ రాగానే ఐశ్వర్య ఎదురుగా వెళ్లి ఎంతసేపని నీకోసం ఎదురుచూడాలి ఎక్కడికి వెళ్లారు ఇంతసేపు అని అడుగుతుంది. తాతయ్యకు ఆపరేషన్‌ చేయించాలని హాస్పిటల్‌కు వెళ్లామని చెప్తుంది. తనకు ఐదు లక్షలు ఇవ్వాలని ఐషు అడుగుతుంది. ఇందు తన దగ్గర డబ్బులు లేవని చెప్తుంది. నాకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ ఈ రాజు గాడికి ఎందుకు ఇచ్చావు..? కంపెనీలో పని చేస్తున్నందుకా..? లేక నీకు అద్దె మొగుడిగా నటిస్తున్నందుకా..? అంటూ అడగ్గానే.. అందరూ షాక్‌ అవుతారు. అప్పుడే శేషు అమ్మ ఐషు ఇందుకు రాజు అద్దె మొగుడు కాదు.. సొంత మొగుడే అది అర్థం చేసుకో ముందు అని చెబితే.. అదంతా నాకు అనవసంర నాకు డబ్బులు ఇవ్వు ముందు అంటూ కోపంగా అడుగుతుంది ఐషు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

Big Stories

Advertisement
×