E-Paper
Advertisement

ట్రైనీ ఐపీఎస్‌కు బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు!

ట్రైనీ ఐపీఎస్‌కు బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు!
Advertisement

Trainee IPS Case: లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్​ ఉదయ్​ కృష్ణారెడ్డిని రెండు రోజులపాటు పోలీస్​ కస్టడీకి అనుమతిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అత్తాపూర్​ పోలీసులు నేడు ఉదయ్​ కృష్ణారెడ్డిని చెంచల్​ గూడ జైలు నుంచి తమ అదుపులోకి తీసుకోనున్నారు.

హైదరాబాద్ లోని సర్ధార్​ వల్లబ్​ భాయ్​ పటేల్ నేషనల్​ పోలీస్​ అకాడమీలో ఐపీఎస్​ ట్రైనింగ్​ లో ఉన్న ఉదయ్​ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ఐపీఎస్​ ట్రైనీ గతనెలలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉదయ్​ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు కత్తితో దాడి చేయటానికి ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు ఉదయ్​ కృష్ణారెడ్డిని అరెస్ట్​ చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. ఆ తరువాత రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. అయితే కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ముఖ్యంగా ఉదయ్​ కృష్ణారెడ్డి ఐ ఫోన్​ గురించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉందని పేర్కొంటూ దర్యాప్తు అధికారులు మరోసారి కస్డడీ పిటిషన్​ వేశారు.

అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఉదయ్​ కృష్ణారెడ్డి పిటిషన్​ దాఖలు చేశారు. రెండింటిపై విచారణ జరిపిన కోర్టు ఉదయ్​ కృష్ణారెడ్డిని మరో రెండు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు మంగళ, బుధవారాల్లో ఉదయ్​ కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు.

Advertisement

Also Read: రెండో పెళ్లి చేసుకుంటే.. ఉద్యోగుల జీతాల్లో 20% కోత.. సీఎం సంచలన ప్రకటన

కాగా, ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 మధ్య ఆయనను విచారణ జరపాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో పాటు ఉదయ్​ కృష్ణారెడ్డికి పొటెన్షియల్​ టెస్ట్​ జరిపించటానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చినట్టు సమాచారం.

Also Read: ‘దమ్ముంటే అసెంబ్లీకి రండి’.. వైసీపీ నేతలకు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

Tags

Related News

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

Big Stories

Advertisement
×