Sunil Gavaskar On Ishan Kishan: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ (India vs Afghanistan) జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ (Afghanistan tour of India 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా రెండో వన్డే మ్యాచ్ లక్నో వేదికగా (Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow) జరిగింది. ఇందులో ఇషాన్ కిషన్ ( Ishan Kishan) అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. 79 బంతుల్లో 125 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ పై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పైన సెంచరీ చేసి.. దక్షిణాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్ కోసం వీసా (visa ) సిద్ధం చేసుకున్నాడని ప్రశంసల వర్షం కురిపించారు. కచ్చితంగా వన్డే వరల్డ్ కప్ జట్టులో ఇషాన్ కిషన్ ఉంటాడని వ్యాఖ్యానించారు సునీల్ గవాస్కర్. విరాట్ కోహ్లీ సలహాలోనే మూడో స్థానంలో అతడు బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ఆడడం కష్టమేనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సునీల్ గవాస్కర్. సెంచరీ చేసి వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడని ప్రశంసలు కురిపించారు. టీమిండియాలో మూడో స్థానంలో ఆడేందుకు ఇషాన్ కిషన్ అర్హుడని వ్యాఖ్యానించారు. టి20 లు, ఐపీఎల్ అలాగే ఇప్పుడు వన్డేలు అద్భుతంగా ఆడుతున్నాడని ఇషాన్ కిషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా అతన్ని వన్డే వరల్డ్ కప్ లోకి తీసుకుంటారని పేర్కొన్నారు సునీల్ గవాస్కర్.
ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తే , కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరిలో ఒకరు తప్పుకోవాల్సి వస్తుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా పనికి వస్తాడు కాబట్టి… రాహుల్ పై మొదట వేటుపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలా కాదని వరల్డ్ కప్ సమయానికి కోహ్లీకి ఏదైనా గాయం అయితే.. కచ్చితంగా అతని తొలగించి ఇషాన్ కిషన్ ను మూడో స్థానంలో పంపిస్తారు. ఈ రెండిటిలో ఏదైనా జరగవచ్చు అని అంచన వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. వరల్డ్ కప్ కోసం ప్రకటించే ప్లేయింగ్ 15 లో మాత్రం ఇషాన్ కిషన్ ఉంటాడని అంచనా వేస్తున్నారు.