BCCI On VVS Laxman: టీమిండియా జట్టును గాడిలో పెట్టేందుకు బీసీసీఐ నిత్యం చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినప్పటికీ కీలక సిరీస్ లలో టీమిండియా క్రికెటర్లు గాయాల బారిన పడటం.. చెత్త ప్రదర్శన కనబరచడం లాంటివి జరుగుతున్నాయి. అలాగే గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ లాంటి టీమిండియా సిబ్బందితో క్రికెటర్లు గొడవలు పెట్టుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో టీమిండియాను సెట్ రైట్ చేసేందుకు హైదరాబాద్ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ ను బరిలోకి దించుతోంది. సెప్టెంబర్ లో అతడికి బీసీసీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పోస్టు ఇచ్చేందుకు సిద్ధమైంది.
టీమిండియా పరిస్థితిని మెరుగుపరిచేందుకు… కోచింగ్ బృందంతో ప్లేయర్ల మధ్య గొడవలు లేకుండా చేసేందుకు వివిఎస్ లక్ష్మణ్ తో కొత్త ప్రయోగం మొదలు పెట్టింది బీసీసీఐ. ఇందులో భాగంగానే వివిఎస్ లక్ష్మణ్ కు బిసిసిఐ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పోస్టు ఇవ్వనుంది. సెప్టెంబర్ మాసంలోనే వివిఎస్ లక్ష్మణ్ ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. అదే నెలలో బీసీసీఐ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. అతడిని కుర్చీలో కూర్చోబెట్టనున్నారు.
బీసీసీఐ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అనే పోస్టును వివిఎస్ లక్ష్మణ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియాను గాడిలో పెట్టేందుకుగాను లక్ష్మణ్ ను ఈ పదవిలో కూర్చోబెడుతున్నారు. అయితే ఈ పదవి సాదాసీదాగా ఉండేలా కనిపించడం లేదు. ప్రత్యేకమైన రూల్స్ లక్ష్మణ్ కు పెడుతూ, కీలక బాధ్యతలను అప్పగించింది. టీమిండియా ప్లేయర్లు తరచూ గాయపడుతున్న నేపథ్యంలో.. వాళ్లను ప్రత్యేకంగా డీల్ చేయాలి.
అలాగే డ్రెస్సింగ్ రూమ్ లో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన ప్రత్యేక బాధ్యత లక్ష్మణ్ కు అప్పగించారు. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లతో కలిసి లక్ష్మణ్ పని చేయాలి. ఇక ముఖ్యంగా కోచింగ్ బృందానికి.. టీమిండియా క్రికెటర్లకు మధ్య గ్యాప్ ను పూడ్చాలి. సెలెక్టర్లను ఉద్దేశించి టీమిండియా క్రికెటర్లు ఎలాంటి కామెంట్స్ చేయకుండా లక్ష్మణ్ చూసుకోవాలి. ఇందులో ఏ ఒక్క రూల్ బ్రేక్ అయిన లక్ష్మణ్ పదవి ఊస్టింగే అని అంటున్నారు.
ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పోస్టులో లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తిస్తే… అతనికి లక్షల్లో జీతం రానుంది. ప్రతి నెల రూ. 50 లక్షలు బిసిసిఐ ద్వారా జీతం అందుకొని ఉన్నాడు. వార్షిక ఆదాయ పరంగా అతని జీతం మరింత పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఈ లెక్కన గతంలో రాహుల్ ద్రావిడ్ ఏడాదికి రూ.12 కోట్లు తీసుకున్నాడు. లక్ష్మణ్ కు కూడా అంతే శాలరీ లభించనుంది. ప్రత్యేక అలవెన్సులు కూడా ఇస్తారు.