Champions Trophy 2025: ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కాబోతోంది. అంటే సరిగ్గా మరో 40 రోజులలో పాకిస్తాన్ వేదికగా ఈ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీంతో ఈ వన్డే టోర్నికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు వారి వారి జట్ల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొననుండగా.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అందరికంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించింది.
Also Read: Ben Stokes: బెన్ స్టోక్స్ కు సర్జరీ.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ నుంచి దూరం ?
ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించే విషయంపై బీసీసీఐ సమయత్తం అవుతుంది. జట్టు కూర్పు, తుది జట్టువంటి విషయాలపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. జనవరి 12వ తేదీలోగా ఆయా క్రికెట్ బోర్డులు వారి టీమ్ ని ప్రకటించాలని ఐసిసి గడువు విధించింది. దీంతో బీసీసీ సెలక్షన్ కమిటీ 36 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ఆటగాళ్ల జాబితాని పరిశీలిస్తే.. భారత ఓపెనర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మ, గిల్, ఋతురాజ్ గైక్వాడ్. ఈ ఐదుగురిలో ముగ్గురు మాత్రమే ట్రోఫీకి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే.. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, రింకు సింగ్, సాయి సుదర్శన్, రజత్ పటిదార్, కె.ఎల్ రాహుల్. అలాగే ఆల్రౌండర్ల విషయానికి వస్తే.. రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్. స్పిన్నర్లు : వరుణ్ చక్రవర్తి, యుజువెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్.
ఫాస్ట్ బౌలర్లు: మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, హర్షిత్ రానా, ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్. ఇలా 36 మంది ఆటగాళ్ల జాబితాని సిద్ధం బిసిసిఐ సెలక్షన్ కమిటీ సిద్ధం చేసింది. ఇందులోనుండి 15 మందిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారు. మిగిలిన 21 మంది ఆటగాళ్లు తప్పుకోవడం ఖాయం.
అయితే ఇందులోనుండి కొంతమంది ఆటగాళ్లను రిజర్వ్ జాబితాకు ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే మరో కీలక విషయం ఏంటంటే.. ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ జట్టును సిద్ధం చేస్తున్న వేళ భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్టార్ పేసర్ బుమ్రా ఈ మెగా టూర్నికి దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Younis Khan – Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ కోసం రంగంలోకి పాకిస్తాన్ క్రికెటర్.. ఇక కప్పు గ్యారంటీ?
బుమ్రా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. ఈ క్రమంలోనే అతడు ఇంగ్లాండ్ తో జరగబోయే టి20, వన్డే సిరీస్ లకు దూరమవుతాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతాడనే వార్తలు వస్తుండడంతో ఇది భారత్ కి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు.