AFG vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో.. ఇవాళ జరిగిన కీలక మ్యాచ్ లో వర్షం విలన్ గా మారింది. మ్యాచ్ కు అంతరాయం కలిగించిన వర్షం… పూర్తిగా మ్యాచ్ ని రద్దయ్యేలా చేసింది. దీంతో… ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్ కు నేరుగా వెళ్ళగా… ఆఫ్ఘనిస్తాన్ టీం మాత్రం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇవాళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో… ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా టీం కు చెరో పాయింట్ అందించారు. ఈ నేపథ్యంలోనే… ఆస్ట్రేలియా ఖాతాలో ఐదు పాయింట్లు వచ్చి పడ్డాయి.
Also Read: Danni Wyatt on Virat: కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో.. ఇంగ్లాడ్ ప్లేయర్ సంచలనం ?
అటు ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలోకి ఒక పాయింట్ రావడంతో మొత్తం మూడు పాయింట్లు సాధించింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ మాత్రం -0.990 గా ఉంది. అంటే ఓవరాల్ గా ఆస్ట్రేలియా ఇప్పుడు నేరుగా సెమి ఫైనల్ కు దూసుకువెల్లింది. మళ్లీ రేపు…. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఎలిమినేట్ అయిన ఇంగ్లాండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే.. నేరుగా సెమీఫైనల్ కు వెళుతుంది. రేపటి మ్యాచ్లో గెలిస్తే… సౌత్ ఆఫ్రికాకు ఐదు పాయింట్లు దక్కుతాయి. ఇదే జరిగితే సౌత్ఆఫ్రికా ఎలాంటి టెన్షన్ లేకుండా సెమీ ఫైనల్ కు దూసుకు వెళుతుంది.
అలా కాదని.. ఇంగ్లాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోతే.. అప్పుడు రన్ రేట్ చూస్తారు. ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ మైనస్ లో ఉంది. సౌత్ ఆఫ్రికా రన్ రేట్ ప్లస్ లో ఉంటే.. అప్పుడు సఫారీలు నేరుగా సెమీఫైనల్ కు వెళ్తారు. ప్రస్తుతానికి +2.140 గా సౌత్ ఆఫ్రికా రన్ రేట్ ఉంది. అంటే ఎలా చూసుకున్నా సౌత్ ఆఫ్రికా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదృష్టం బాగుంటే ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు వెళ్లే ఛాన్సే లేదు. ఇవాళ వర్షం పడక రిజల్ట్ వచ్చి ఉంటే… పరిస్థితి వేళలా ఉండేది. ఇది ఇలా ఉండగా… మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే… ఇవాల్టి మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆహ్వానిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అటల్ అద్భుతమైన ఆట ప్రదర్శనతో… ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ఆఫ్గనిస్తాన్. 95 బంతుల్లో 85 పరుగులు చేసి దుమ్ము లేపాడు అటల్. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… 12.5 ఓవర్లలో.. ఒక వికెట్ నష్టపోయి 109 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఆ సమయంలోనే వర్షం మ్యాచ్ కు అడ్డంకిగా మారింది. ఎంతసేపటికి కూడా వర్షం తగ్గకపోవడంతో… పూర్తిగా మ్యాచ్ రద్దు చేశారు. అప్పటికే ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు హెడ్ 40 బంతులు 59 పరుగులు చేసి… మంచి టచ్ లో ఉన్నాడు. వాళ్ల ఊపు చూస్తుంటే.. వర్షం పడకుండా ఆస్ట్రేలియా మ్యాచ్ విన్ అయ్యేది అన్నట్లుగానే కనిపిస్తోంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్… రద్దు అయి… చెరో పాయింట్ రావడం జరిగింది.
Also Read: Also Read: PSL – IPL: పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ.. PSL ను దెబ్బ కొట్టిన ఐపీఎల్ 2025 ?
Only in Pakistan 😭😂 pic.twitter.com/bZTEN2dUqb
— Times Algebra (@TimesAlgebraIND) February 28, 2025