BigTV English

ICC T20I World Cup 2024: మే 1న ప్రకటించే ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జట్టు ఇదేనా..?

ICC T20I World Cup 2024: మే 1న ప్రకటించే ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జట్టు ఇదేనా..?

India Squad for ICC T20I World Cup 2024


India Squad for ICC T20I World Cup 2024: ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జట్లలో ఎవరుంటారు? ఎవరుండరు? ఇప్పుడు టాక్ ఆఫ్ ది పబ్లిక్ గా మారిపోయింది.భారత్ తో సహా అన్ని జట్లు కూడా మే 1న తమ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. అంతేకాదు కొన్ని నియమ నిబంధనలను కూడా విధించింది.

ఒక దేశం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. అయితే మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులు చేసే వెసులుబాటుని కల్పించింది. ఎందుకంటే ఏ ఆటగాడు గాయపడి, లేకపోతే వ్యక్తిగత కారణాలతోనో వెళ్లాల్సి వస్తే, అప్పుడు ప్రతి దేశానికి ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నే చూస్తే, ఇండియాలో సగం మంది ఆటగాళ్లు వివిధ కారణాలతో బయటకు వెళ్లారు. కొందరు గాయపడి వెళ్లి వచ్చారు. కొందరు ఇంక రాలేదు. ఇలా సమస్యలు ఉంటాయని భావించి అవకాశం ఇచ్చింది.


జూన్ 1 నుంచి టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మే 25 వరకు ఆటగాళ్లను మార్చుకోవచ్చు. అయితే 15మంది పేర్లు మాత్రం ముందుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మే 1న జట్టుని ప్రకటించే అవకాశం ఉంది.

Read More: మహిళల విజయాలని ఎప్పటికి గుర్తిస్తారు: సానియా మీర్జా

అయితే అందరూ ఊహించినట్టుగానే జట్టులో పది మంది అయితే తప్పనిసరిగా ఉంటారని అంటున్నారు. వారెవరు అంటే…

కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, గిల్/ సూర్యకుమార్ యాదవ్, విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రింకూ సింగ్/ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇలా పది మంది ఉన్నారు. వీరిలో ఒక స్పిన్నర్ లేదా పేసర్ ని తీసుకుంటే టీమ్ సెట్ అయిపోయినట్టే అంటున్నారు.

పేసర్ అయితే సిరాజ్, స్పిన్నర్ అయితే రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ ఇద్దరు ఉన్నారు. ఇకపోతే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను తొలగించింది. దీంతో వీరేమైనా ఐపీఎల్ లో అద్భుతాలు చేస్తే, చిన్న అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పటికే ఫుల్ ప్యాక్ అయిన టీమ్ ఇండియాలోకి రావడం వీరిద్దరికి కష్టమేనని అంటున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×