BigTV English

Sania Mirza: మహిళల విజయాలని ఎప్పటికి గుర్తిస్తారు: సానియా మీర్జా

Sania Mirza: మహిళల విజయాలని ఎప్పటికి గుర్తిస్తారు: సానియా మీర్జా

Sania Mirza


sania mirza powerful post inspired by Ad On women success: జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నించే మాజీ టెన్నీస్ స్టార్ సానియా మీర్జా చాలా రోజుల తర్వాత నెట్టింట చిన్న కథ చూసి ఎక్స్ వేదికగా స్పందించింది.

ఇంతకీ సానియా మీర్జాను ఇంతగా కదిలించిన ఆ కథ ఏమిటంటే…
ఒక పట్టణంలో ఒక బ్యూటిషియన్ ఉంటుంది. అంటే ఆడవాళ్లు బ్యూటిషియన్ పనులు చేయకూడదనేది సమాజంలో నాటుకుపోయిన అభిప్రాయం. అయితే ఆమె ఆ కట్టుబాట్లను  ఎదిరించి, తన కష్టంతో ఒక కారు కొంటుంది. అందరూ ఆ కారు బాగుందని అంటారు గానీ, తన కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఇది ఆ కథలో సారాంశం.


దీనిని చూసిన సానియా ఏమని రాసిందంటే, నేను 2005లో డబ్ల్యూటీఏ టైటిల్’ గెలిచాను. అలా భారత మొదటి మహిళగా నిలిచాను. ఇంకా డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ 1 ప్లేయర్‌గా నిలిచాను. అప్పుడు నన్నందరూ మెచ్చుకున్నారు. అయితే  ఓ మహిళ విజయం సాధించినప్పుడు ఆమెలోని నైపుణ్యాలు, శ్రమని ఎవరూ గుర్తించరు, అవి తప్ప అన్నీ చర్చిస్తారని పేర్కొంది.

Read more: మళ్లీ రంజీల్లో ఆడనున్న శ్రేయాస్..!

బహుశా తన ఉద్దేశం ఆ కథ సారాంశం ప్రకారం బ్యూటీషియన్ కష్టాన్ని పట్టించుకోకుండా, కారుని మాత్రమే గుర్తించారు. ఇక్కడ సానియా భావం ఏమిటంటే,తన టెన్నీస్ ఆటలోని గొప్పతనాన్ని కాకుండా, తన జీవితంలో జరిగిన విడాకులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని భావించడం వల్లే ఈ పోస్టు పెట్టిందని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.

అందుకే మహిళా వివక్ష ఇంకా కొనసాగుతోందని, అదే మగవారి విషయంలో వారెన్ని చేసినా పట్టించుకోరు, వారు జీవితంలో సాధించిన విజయాలనే చూస్తారు, అదే ఆడవారి విషయంలో అసలు విషయాన్ని తప్ప, అన్నీ పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది.

చివరిగా మాట్లాడుతూ ఈ కథ చూసిన తర్వాత నా మనసులో చాలా భావాలు మెదిలాయని తెలిపింది.  మన సమాజంలో వాస్తవాలు మాట్లాడితే భరించలేరని చెప్పింది. కానీ ఓ మహిళగా సాధించిన విజయానికి, ఎంతటి విలువ ఇస్తున్నాం..ఈ విషయాన్ని అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలిపింది. కానీ అది ఎప్పటికీ జరుగుతుందో, నాక్కూడా తెలీదని ట్వీట్ లో పేర్కొంది.

Related News

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Big Stories

×