IND in ICC: సినిమాల తరహాలోనే క్రీడలలోను ఎన్నో సెంటిమెంట్లను అనుసరిస్తుంటారు. మైదానంలోకి దిగినప్పటి నుండి గెలుపు దాకా.. క్రికెట్ లో ఎన్నో సెంటిమెంట్లను ఆపాదిస్తుంటారు. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ లోను అలాంటి లెక్కలే వేసుకుంటున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు గెలుస్తుందని నమ్మకాలు భారతీయులలో గట్టిగానే ఉన్నాయి.
Also Read: David Miller: మిల్లర్ భారీ సిక్స్.. బంతి దొంగిలించిన పాక్ ఫ్యాన్స్ !
కానీ కొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు మాత్రం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ లో నాలుగు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఇక బుధవారం న్యూజిలాండ్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై న్యూజిలాండ్ జట్టు గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న టీమిండియా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతోంది.
ఈ నేపథ్యంలో టీమిండియాను ఓ సెంటిమెంట్ భయపడుతుంది. అదే ఫైనల్స్ లో ఓడిపోవడం. ఇందుకు గతంలో జరిగిన మ్యాచ్ ల ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అవేంటంటే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు గ్రూప్ స్టేట్ లో పాకిస్తాన్ పై విజయం సాధించింది. కానీ ఫైనల్ లో పాకిస్తాన్ జట్టు భారత్ పై విజయం సాధించింది. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
కానీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుపై ఆస్ట్రేలియా విజయం సాధించి కప్ ని ఎగరేసుకుపోయింది. ఇప్పుడు ఐసీసీ ఛాంపియర్స్ ట్రోఫీ 2025లో కూడా భారత జట్టు గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ పై గెలుపొందింది. అయితే ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఓడిపోబోతుందా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం అలా జరగదని భారత క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తప్పకుండా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధిస్తుందని చెబుతున్నారు.
Also Read: Saud Shakeel: మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు.. పాకిస్థాన్ ప్లేయర్లకే ఇది సాధ్యం…!
ఈసారి కచ్చితంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను తప్పు అని ప్రూవ్ చేస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జట్టులోని ప్రతి ఆటగాడు సూపర్ ఫామ్ లో ఉన్నారని.. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఎవరి రోల్ ని వాళ్ళు అద్భుతంగా పోషిస్తున్నారని.. భారత జట్టు విజయం తథ్యం అని చెబుతున్నారు. అంతేకాకుండా 2019 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో భారత జట్టును ఓడించింది న్యూజిలాండ్. దీంతో ఇప్పుడు పాత బాకీ తీర్చుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు అభిమానులు. 2019 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోని రన్ అవుట్ అయిన దృశ్యం ఇప్పటికీ అభిమానులను కలచివేసేదే. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం జరుగుతుందని చెప్పవచ్చు.