IND vs ENG 1st T20: ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ-20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి టీ-20 మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. ఈ తొలి టి-20 కలకత్తా వేదికగా రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ తొలి టి-20 లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఐదు టి-20ల సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Shikhar Dhawan: కుంభమేళాలో శిఖర్ ధావన్.. ఆ అందాల తారతో ఏకంగా?
మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకి జోస్ బట్లర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉత్కంఠ భరిత పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. ఇంగ్లాండ్ – భారత్ జట్ల మధ్య ఇప్పటివరకు 24 టి-20 మ్యాచ్ లు జరగగా.. ఇందులో భారత జట్టు 13 మ్యాచ్ లలో గెలుపొందింది. మరో 12 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టు గెలుపొందింది. భారత్ వేదికగా ఇంగ్లాండ్ – భారత్ జట్లు 11 మ్యాచ్ లలో పోటీ పడగా.. ఇందులో భారత జట్టు ఆరుసార్లు గెలుపొందింది.
మరో ఐదు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ తొలి టి-20 కి వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్ లో భారత జట్టు ఇప్పటివరకు ఏడు టి-20 లు ఆడింది. ఈ ఏడింటిలో భారత జట్టు 6 మ్యాచ్ లలో విజయం సాధించింది. కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే ఓటమిని మూటగట్టుకుంది. ఆ ఒక్క ఓటమి 2011వ సంవత్సరంలో ఇంగ్లాండ్ చేతిలోనే ఎదుర్కోవడం గమనార్హం.
అయితే చాలా కాలంగా టీమిండియా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మళ్లీ ఈ ఐదు టి-20 ల సిరీస్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టి-20 సిరీస్ తో మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇది మాత్రమే కాకుండా ఇంగ్లాండ్ తో జరగబోతున్న వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి షమీ ఎంపికయ్యాడు.
కానీ మొదటి టీ20 లో షమీ ని బెంచ్ కి పరిమితం చేసింది బీసీసీఐ. ఇందుకు గల కారణాలేంటో తెలియ రాలేదు. షమీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడాన్ని భారత మాజీ ఆటగాడు సౌరబ్ గంగూలీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. షమీ రాకతో భారత జట్టు బలం గణనీయంగా పెరిగిందని అన్నాడు. కానీ తొలి టి-20 లో అతడిని జట్టు నుంచి తప్పించడం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసింది.
Also Read: Michael Vaughan: టీమిండియాకు డేంజర్ బెల్స్..3-2 గెలుస్తామని మైఖేల్ వాన్ హెచ్చరికలు ?
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(w), జోస్ బట్లర్(c), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.