టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొదటి టి20 మ్యాచ్ లో…. టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అదరగొట్టే బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. ఓపెనర్ గా రంగంలోకి దిగిన సంజు శాంసన్… సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!
47 బంతుల్లో 100 పరుగులు చేసుకున్నాడు సంజు శాంసన్. ఇందులో తొమ్మిది సిక్సులు ఉండగా ఏడు ఫోర్లు ఉన్నాయి. 212.77 స్ట్రైక్ రేట్ తో… అద్భుతమైన సెంచరీ సాధించాడు సంజు శాంసన్. సంజు దాటికి సౌత్ ఆఫ్రికా బౌలర్లు విలవిలలాడిపోతున్నారు.
ఇక అంతకుముందు… బ్యాటింగ్కు వచ్చిన అభిషేక్ శర్మ ఏడు పరుగులకు అవుట్ అయ్యాడు. అలాగే సూర్య కుమార్ యాదవ్ 21 పరుగులు చేసి రాణించాడు. వాళ్ళిద్దరూ అవుట్ అయిన… సంజు మాత్రం… దుమ్ము లేపి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.