E-Paper
Advertisement

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!
Advertisement

Inzamam-ul-Haq On Team India:  పొద్దున లేస్తే చాలు టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతూనే ఉంటారు. టీమిండియా గెలిస్తే ఫిక్సింగ్ అనడం, ఓడితే చేతకాలేదని..వికెట్ తీస్తే అంపైర్లను కొనేశారని నోటికి ఏది వస్తే అదే వాగేస్తుంటారు. అయితే, తాజాగా టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా మన క్రికెటర్లు ఓ ప్రత్యేకమైన పరికరాన్ని వీపులపై పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, వీటిని చూసిన పాకిస్తాన్ మీడియా నోటికి వచ్చిన సొల్లు వాగేస్తోంది.

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలతో కుట్రలు చేస్తున్నారు!

ఇదే విషయంపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా స్పందించి, వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వరుసగా అన్ని మ్యాచ్ లు గెలవడానికి ఈ పరికరాలే కారణమంటూ బాంబ్ పేల్చారు. వీటికి పెట్టుకుని, ఫిక్సింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. వీపులపై పరికరాలు పెట్టుకుని.. డ్రెస్సింగ్ రూం నుంచి వచ్చే సూచనలు ఫాలో అవుతున్నారని పేర్కొన్నారు. రివ్యూ తీసుకునేటప్పుడు కూడా డ్రెస్సింగ్ రూం నుంచి వచ్చే ఆదేశాలను ఈ పరికరాలతో విని, పాటిస్తారంటూ ఆరోపించారు. అందుకే టీమిండియా అన్నింటిలోనూ గెలుస్తోందన్నారు. పై జీపీఎస్ ట్రాకర్లు అని అబద్ధాలు చెబుతున్నట్టు బాంబ్ పేల్చారు. కానీ అందులో చిప్స్ పెట్టి, తతంగం నడిపిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

టీమిండియా ప్లేయర్ల వీపులపై ఉన్న పరికరాలు ఏంటి?

టీమిండియా, విండీస్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా మనోళ్లు ధరించిన పరికరాలను జీపీఎస్ ప్లేయర్ ట్రాకర్ అని పిలుస్తారు. వీటిని కంప్రెషన్ వెస్ట్ లోపల, రెండు షోల్డర్ల మధ్య సెట్ చేసిన ప్యాకెట్ లో ఉంచుతారు. స్టార్ స్పోర్ట్స్ లాంటి సంస్థలు ఈ పరికరాలను తయారు చేస్తుంది. ఇందులో మోషన్ సెన్సార్లతో పాటు జీపీఎస్ అమర్చుతారు. ప్లేయర్ శారీరక శ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను డ్రెస్సింగ్ రూంకు అందిస్తుంది.

Advertisement

ప్లేయర్ ఎంత పరుగెత్తాడు, ఎంత కష్టపడ్డాడు, అతని పరిస్థితి ఏంటి అనే వివరాలకు రీడింగ్ చేస్తుంది. ఇదంతా ఐసీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇందులో ఫిక్సింగ్ కు తావు లేదు.  వీటి ద్వారా ఫిక్సింగ్ చేసే ఛాన్స్ ఏ మాత్రం ఉండబోదు. కేవలం ప్లేయర్ల పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి మాత్రమే వాడతారు. కానీ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం దీన్ని తప్పుగా ట్రీట్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. పాక్ మీడియా కూడా దిగజారి, తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !

Big Stories

Advertisement
×